ANDHRA PRADESH NEW GOVERNMENT NEW CABINET DECIDED BY YS JAGAN SPEAKER CHANCE FOR ROJA NK
వైఎస్ జగన్ కొత్త కేబినెట్ ఇదే... స్పీకర్ ఎవరో తెలుసా...
సీఎం వైఎస్ జగన్, నగరి ఎమ్మెల్యే రోజా
AP Government New Cabinet : కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. మరి వారిలో కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కాయో న్యూస్ 18 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోండి.
(బాలకృష్ణ.ఎం, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18)
ఏపీలో జగన్ మోహాన్ రెడ్డి చరిత్రత్మక విజయం తరువాత ఇప్పుడు అందరి దృష్టీ కేబినెట్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపైనే ఉంది. ముందు నుంచి పార్టీకి 126 స్థానాలు వస్తాయని అంచనా వేసిన జగన్ అనూహ్యంగా 151 స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడు కేబినేట్ కూర్పు అనేది చాలా కష్టతరంగా మారిందని భావిస్తున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా కేబినెట్లో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ కూర్పు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. తనతో కలిపి మొత్తం 26 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తనను పక్కన పెడితే... మరో 25 మందికి తొలి కేబినెట్లో స్థానం కల్పించాలని జగన్ లెక్కలేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లో మంత్రులుగా చేసినవారితోపాటూ... కొత్త వారికి కూడా కేబినెట్లో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం... జగన్ మంత్రి పదవులు కింది వారికి ఇస్తున్నట్లు తెలిసింది. ఐతే... ఈ విషయంలో జగన్ పూర్తిగా ఫైనల్ నిర్ణయానికి రాలేదనీ, పార్టీలో లోతుగా చర్చ జరుగుతోందనీ తెలిసింది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒకరు చొప్పున కేబినెట్లోకి తీసుకునేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలా వద్దా అన్నదానిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. జగన్ కేబినెట్ అంశంలో ప్రశాంత్ కిషోర్ జోక్యం కూడా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ కేబినెట్లో వీళ్లకు ఛాన్స్? :
ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : రోజా
డిప్యూటీ స్పీకర్ : పేర్ని నాని
రెవెన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కొడాలి వెంకటేశ్వర రావు
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్య : అవంతి శ్రీనివాస్
విద్య : అనిల్ కుమార్ యాదవ్
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : ఆర్కే
దేవాదాయ : కోన రఘుపతి
ఐటీ : అభయ్ చౌదరి
విద్యుత్ శాఖ : మేకపాటి గౌతమ్ రెడ్డి
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్
కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
సాంఘిక సంక్షేమం : కె.భాగ్యలక్ష్మి
వ్యవసాయం : మర్రి రాజశేఖర్
మార్కెటింగ్, పశుసంవర్థకం : బి. అప్పల నాయుడు
టూరిజం, తెలుగు సంస్కృతి : ఉదయభాను
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణ నిధి
ఇండస్ట్రీస్ : బాల్ రాజు
ప్రస్తుతానికి పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కేబినెట్లో వీళ్లకు స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వీళ్లలో చాలా మందికి ఎన్నికలకు ముందే జగన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీదే ఉంటారనీ... అందువల్ల తమ బెర్త్ ఖాయమని నమ్మతున్నారు ఆ నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.