చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలి... టీడీపీ కార్యకర్తలతో భువనేశ్వరి

చంద్రబాబును తిరిగి సీఎం చేయాలని...ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

news18-telugu
Updated: April 3, 2019, 12:00 PM IST
చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలి... టీడీపీ కార్యకర్తలతో భువనేశ్వరి
నారా భువనేశ్వరి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టీడీపీ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమె కూడా పరోక్షంగా పాల్గొంటున్నారు. తన భర్త చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని ఆమె కుప్పం టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. చంద్రబాబును తిరిగి సీఎం చేయాలని...ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి 75శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో చంద్రబాబును పాస్‌ చేయించాలని వారికి సూచించారు.

కార్యకర్తలంతా ప్రజలను కలవాలని... అతివిశ్వాసం వద్దని భువనేశ్వరి వారికి సూచించారు. మూడు దశాబ్దాల క్రితం చంద్రగిరి నుంచి కుప్పం నియోజకవర్గానికి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇప్పటివరకు అక్కడ ఓటమిని చవిచూడలేదు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పులివెందులతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడి ప్రజలను కోరుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సైతం హిందూపురంలో ప్రచారం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి సైతం ఆయన గెలుపు కోసం స్వయంగా ప్రచారానికి రాకపోయినా... టెలికాన్ఫిరెన్స్ ద్వారా కార్యకర్తలకు సూచనలు చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: April 3, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading