Home /News /politics /

ANDHRA PRADESH MUNICIPAL RESULT UPDATE BIG SHOCK TO MINSTER BUGGANA TDP WIN AND MAJORITY MUNICIPALITIES GOES TO YCP NGS

Municipal Election Result: కీలక నేతలకు చుక్కలు చూపిస్తున్న ఫలితాలు.. మంత్రి బుగ్గనకు భారీ షాక్

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

Municipal Election Reusult: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు సంబంధించిన ఫలితాలు కీలక నేతలకు షాకిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పంలో టీడీపీ కంచుకోట బద్దలైంది. చాలాచోట్ల టీడీపీ కీలక నేతలకు చుక్కెదురైంది. అధిక మున్సిపాలిటీల్లో వైసీపీ హవా కొనసాగుతుంటే.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్ తగిలింది.

ఇంకా చదవండి ...
    Big Shock to Minster Buggana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాలతో ఉత్కంఠ వీడింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కుప్పం  (Kuppam)లో ఎలాంటి ఫలితం వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అధికార పార్టీ ముందు నుంచి చెబుతున్నా.. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ (ycp) జెండా ఎగిరింది. కుప్పం మున్సిపాలిటీనీ వైసీపీ సొంతం చేసుకుంది. కేవలం కుప్పమే కాదు మెజార్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రావ్యాప్తంగా ఎక్కువ చోట్ల టీడీపీకి షాక్ లు తగిలితే.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి.

    ముఖ్యంగా మంత్రుల స్వగ్రామం.. వారు నివాసముండే ప్రాంతాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15వ వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి.

    ఇదీ చదవండి : ఘనంగా రోజా పుట్టిన రోజు వేడుక.. సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..? ఆమె అసలు పేరు తెలుసా..?

    ఇప్పటికే ఇదే జిల్లాలో జరిగిన సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి షాక్ లు తప్పలేదు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 1 నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓటమిపాలవ్వడం గమనార్హం. అలాగే ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

    ఇదీ చదవండి : ఆ రెండు నగరాల్లో విస్తరించిన చైల్డ్ పోర్న్ రాకెట్.. దుండుగులను పట్టుకునేందుకు సీబీఐ ఫోకస్

    మెజార్టీ మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధిస్తోంది. ఇటు కార్పొరేషన్లలో వైసీీపీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లోనూ వైసీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 12 మున్సిపాలిటీలకు గానూ 8 మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా రాయచోటి, కమలాపురం, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీని అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Buggana Rajendranath reddy, Tdp, Ycp

    తదుపరి వార్తలు