• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH MUNICIPAL ELECTIONS WILL BE REFERENDUM FOR THREE CAPITALS DECISION YSRCP AND TDP PLANNING TO WIN IN VIJAYAWADA GUNTUR VISAKHAPATNAM AND KURNOOL HERE ARE THE DETAILS PRN

AP Municipal Elections: మూడు రాజధానులకు రెఫరెండంగా మున్సిపల్ ఎన్నికలు... రాజకీయ రగడకు ఫుల్ స్టాప్ పడుతుందా..?

AP Municipal Elections: మూడు రాజధానులకు రెఫరెండంగా మున్సిపల్ ఎన్నికలు... రాజకీయ రగడకు ఫుల్ స్టాప్ పడుతుందా..?

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని (Capital) పరిధిలో ఉన్న విజయవాడ (Vijayawada) , గుంటూరు (Guntur) మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విశాఖపట్నం (Visakhapatnam), కర్నూలు (Kurnool) నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. గత ఏడాది ఏ దశలో అయితే ఎన్నికలు వాయిదా పడ్డాయే.. అక్కడి నుంచే ప్రక్రియ మొదలుకాబోతోంది. ఇక పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో రాష్ట్రంలో ఎవరి బలమెంత అనే అంశంపై పూర్తి స్పష్టత రానుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు అంశంలో మున్సిపల్ ఎన్నికలు కీలకపాత్ర పోషించబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మున్సిపోల్స్ రిఫరెండం కాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విశాఖపట్నం, కర్నూలు నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు.. ఈ నాలుగు నగరాలు ఒక ఎత్తు అనే రీతిలో ఇప్పుడు పురపోరు సాగునుంది.

    రాష్ట్ర ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ఈ ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని వ్యవహారం తీవ్రదుమారాన్ని రేపుతోంది. రాజధాని విషయంలో సీఎం ప్రజలను మోసం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కోర్టులో కేసులు పరిష్కారమైన వెంటనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అటు హైకోర్టు తరలింపు కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.

    ఇది చదవండి: పంచాయతీ ఎన్నికల్లో మారిన ట్రెండ్... ఇప్పుడిదే ప్రచారాస్త్రం



    మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధాని ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఎవరి నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలపబోతున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు నగరాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నగరాల్లో ఎవరు గెలిస్తే వారి నిర్ణయాన్ని ప్రజలు గౌరవించినట్లు భావించాలన్న ప్రచారం జరుగుతోంది.

    ఈ నాలుగు చోట్ల గెలుపు ద్వారా మూడు రాజధానుల నిర్ణయం సరైందేనని నిరూపించాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు రాజధానిగా అమరావతికే ప్రజల మద్దతు ఉంటుందని నిరూపించాలంటే టీడీపీ తప్పక గెలవాలి. ఈ విషయంలో జనసేన-బీజేపీలది కూడా అదే టార్గెట్. గెలుపు విషయంలో అధికార వైసీపీ గెలుపై ధీమా ఉండగా.. మూడు రాజధానుల నిర్ణయం తప్పని నిరూపించేందుకు ప్రతిపక్షాలు వ్యూహారు రచిస్తున్నాయి. మున్సిపోల్స్ రాజధాని రిఫరెండంగా మారిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు..?  అమరావతికి జై కొడతారా..? లేక మూడు రాజధానులకు సై అంటారా..? అనేది తెలియాలంటే మార్చి 14వరకు ఆగాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published: