news18-telugu
Updated: August 6, 2020, 2:15 PM IST
ఏపీ అసెంబ్లీ భవనం
ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ జూలై 1న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ జూలై 30 షెడ్యూల్ జారీ చేసింది. మోపిదేవితో పాటు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం కేవలం 8 నెలలే ఉంది. దీంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నేడు నోటిఫికేషన్ జారీ అయింది 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఆగస్ట్ 17వ తేదీ లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు అయితే, ఆగస్ట్ 24న సోమవారం రోజు ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుపుతారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అభ్యర్థి 2023 మార్చి 29 వరకు పదవిలో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తన ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 6, 2020, 2:15 PM IST