ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు చతికిలపడుతున్నారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి ఆయన 600 ఓట్లు వెనుకబడ్డారు. కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో రెండో రౌండ్లో వెనుకబడ్డ సీఎం చంద్రబాబు మాత్రం మూడో రౌండ్ వచ్చేసరికి 1500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వెనుకపడ్డారు. వెనుకంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి గొర్ల కిరణ్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.