• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH MINISTER SLAMS FORMER ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR OVER LOCAL BODY ELECTIONS RIFT FULL DETAILS HERE PRN

YCP vs Nimmagadda: ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.. నిమ్మగడ్డకు వైసీపీ కౌంటర్స్

YCP vs Nimmagadda: ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.. నిమ్మగడ్డకు వైసీపీ కౌంటర్స్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) పై వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party) విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది. ఆయన పదవి నుంచి దిగిపోయిన వెంటనే టార్గెట్ చేసింది.

  • Share this:
    ఎస్ఈసీగా పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్  (Nimmagadda Ramesh Kumar)పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) విమర్శల దాడి పెంచింది. ఆయన పదవి నుంచి దిగిపోయిన వెంటనే పార్టీ కీలకనేతలు నిమ్మగడ్డ టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని.. నిమ్మగడ్డ తీరుపై మండిపడ్డారు. ఉద్యోగం చివరి రోజున నీతులు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గవర్నర్‌కు రాసిన లేఖను ఒక విచిత్రంగా భావిస్తున్నామని పేర్ని నాని అన్నారు. తన ఉద్యోగం ఆఖరి రోజున ఎన్నికల సంస్కరణలు అంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో పలు సిఫారస్‌లు చేశారని.., వాటిని చూస్తే.. ‘పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడనే’ సామెత గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. తన లేఖ ఉపోద్ఘాతంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శంగా నిర్వహించడంపై ప్రస్తావించారని... ఇది చదివిన వారు ఆయన అనుసరించిన విధానం చూసిన వారు నవ్వుకుంటున్నారని పేర్ని నాని చెప్పారు.

    చంద్రబాబు మనిషే..
    నిమ్మగడ్డ వంద శాతం చంద్రబాబు మనిషిగానే ప్రజలు నమ్ముతున్నారన్న పేర్ని నాని... ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చంద్రబాబు ప్రయోజనాల కోసమే బాధ్యతలు నిర్వర్తించారని ఆరోపించారు. అటువంటి ఆయన ఎన్నికల సంస్కరణల పేరుతో సిఫార్సులు చేస్తూ నిర్లజ్జగా బరితెగించి ఉత్తరాలు రాయడం హాస్యాస్పదంగా వుందన్నారు. ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలకు దూరంగా వుండాలని సిఫార్సులు చేస్తన్న నిమ్మగడ్డ.. స్టార్‌ హోటల్లో కామినేని, సుజనాచౌదరిలను కలిసి గంటల తరబడి మంత్రాంగం, యంత్రాంగం నడిపించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీలు ఇవే.. వారికి ఉరటనిచ్చిన ప్రభుత్వం


    అంతా చంద్రబాబు డైరెక్షన్
    నిమ్మగడ్డ రమేష్‌ వివాదాలకు మూలవిరాట్టని.., కోవిడ్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కానప్పుడు హడావుడిగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారన్నారు. మరో అయిదు రోజుల్లో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేసి.. కోవిడ్‌ కేసులు బాగా వున్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందేనని, కోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిపితే చంద్రబాబుకు నష్టం జరుగుతుందని, ఏడాది తరువాత వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక వస్తుందని ఊహించుకుని, అలా వచ్చిన తరువాత ఎన్నికలు నిర్వహించాలన్న చంద్రబాబు సూచనల మేరకే ఎన్నికలను వాయిదా వేసిన విషయం నిజం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..? కొత్త ఎస్ఈసీ తొలి ప్రకటన అదేనా..?



    గుంటూరులో ఓటు ఎలా ఇస్తారు..?
    తాను హైదరాబాద్‌లో కాపురం వుంటూ.. గుంటూరులో ఓటు కావాలని నిమ్మగడ్డ ఎలా అడుగుతారని పేర్ని నాని నిలదీశారు. ఎన్నికల కమిషన్‌ పేర్కొన్న ఫాం–6లో ఎక్కడ నివాసం వుంటున్నారో అక్కడే ఓటు లభిస్తుందని స్పష్టంగా వున్నప్పటికీ కూడా తనకు గుంటూరులో ఓటు కావాలని నిమ్మగడ్డ ఎలా డిమాండ్‌ చేస్తారన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల పట్ల నిమ్మగడ్డకు వున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. నిబంధనలను పక్కన పెట్టి తనకు ఓటు ఇవ్వాలని, అలా చేయకపోతే తన ఓటును జగన్‌ గారే ఆపేశారన్నట్లు నిమ్మగడ్డ మాట్లాడటం సరికాదన్నారు.

    ఇది చదవండి: బీజేపీకి షాక్ ఇవ్వ‌బోతున్న ప‌వ‌న్..? రంగంలోకి దిగిన కేంద్ర పెద్ద‌లు..?


    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు