ANDHRA PRADESH MINISTER PERNI NANI CONDUCTED MEETING WITH PRODUCER AND EXHIBITORS AND DISCUSSED ABOUT TOLLYWOOD ISSUES FULL DETAILS HERE PRN
AP Movie Tickets Issue: టాలీవుడ్ అంశంపై ప్రభుత్వం ఫోకస్.. ముద్రగడ లేఖతో మరో ట్విస్ట్.. క్లైమాక్స్ ఎంటీ..?
పేర్ని నాని (File)
టాలీవుడ్ సమస్యలపై (Tollywood Issues) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దృష్టిసారించింది. ఈ మేరకు సినీ నిర్మాతలు (Producers), ఎగ్జిబిటర్ల (Exhibiters) తో రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని నాని (Minister Perni Nani) సమావేశమయ్యారు.
టాలీవుడ్ (Tollywood) సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దృష్టిసారించింది. ఈ మేరకు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని నాని (Minister Perni Nani) సమావేశమయ్యారు. సోమవారం సెక్రటేరియట్లో జరిగిన సమావేశంనికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), డీవీవీ దానయ్య (DVV Danaiah), ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు సమావేశానికి హాజరయ్యారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలంగా తీవ్రచర్చనీయాంశమైన ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. ఆన్ లైన్లో టికెట్లు విక్రయించాలని చిరంజీవి, నాగార్జున ప్రభుత్వాన్ని కోరినట్లు ఇప్పటికే మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
త్వరలోనే ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయించి ప్రజలకు వినోదాన్ని అందిస్తామని పేర్ని నాని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఎనిమిది మందితో కూడిన కమిటీని నియమించినట్లు వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. మెగాస్టార్ చిరంజీవి అంటే సీఎం జగన్ కు గౌరవం ఉందని.. సోదరభావంతో చూస్తారని తెలిపారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఎలాంటి విన్నపం చేసినా సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల గురించి నిర్మాతలకు వివరించామని ఆయన చెప్పారు. టికెట్ ధరలపై ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లో అమలు చేయాలని.., అందుకు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి అన్నారు. అలాగే నిర్మాతల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు.
మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంపై నిర్మాతలు స్పందించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం ఆక్సిజన్ ఇచ్చిందని నిర్మాత సీ.కల్యాణ్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సీఎం జగన్ భరోసా ఇచ్చారని.. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ కావాలని తామే కోరినట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ విధానం ఉందని.., ఏఫీలో కూడా అమలు చేయాలని తాము కోరినట్లు సీనియర్ నిర్మాత జి.ఆదిశేషగిరిరావు తెలిపారు. అలాగే సినిమా టికెట్ల రేట్లు సవరించాలని కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన అన్నారు.
సీఎం జగన్ కు ముద్రగడ లేఖ...
ఇదిలా ఉంటే సినీపరిశ్రమ వ్యవహారంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఒక మాజీ ఎగ్జిబిటర్ గా టికెటింగ్ విధానం ఆన్ లైన్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు సినిమాలో నటీనటుల దగ్గర నుంచి అందరి రెమ్యునరేషన్లు ఆన్ లైన్ ద్వారానే చెల్లించాలని... అలా చేస్తే ఎగవేతలు, బ్లాక్ మనీ వంటి సమస్య రాదని సూచించారు. తన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.