• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH MINISTER PEDDIREDDY RAMACHANDRA REDDY WARNS OFFICIALS TO NOT FOLLOW AP SEC NIMMAGADDA REMESH KUMAR ORDERS OVER UNANIMOUS PANCHAYATS PRN

SEC vs YSRCP: నిమ్మగడ్డ మాట వింటే మీ సంగతి చూస్తాం.. అధికారులకు మంత్రి వార్నింగ్

SEC vs YSRCP: నిమ్మగడ్డ మాట వింటే మీ సంగతి చూస్తాం.. అధికారులకు మంత్రి వార్నింగ్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలు, చేస్తున్న బదిలీలు ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ఇటు మంత్రులు, సలహాదారుల విమర్శలకు ఎస్ఈసీ లేఖలు, ఫిర్యాదులు, పర్యటనలు, బదిలీలతో కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరూ ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా. అటు ఎస్ఈసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారులు, ఉద్యోగులు నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉంది అధికారుల పరిస్థితి. ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు అగ్నికి ఆజ్యం పోశాయి.

    ఏకగ్రీవాల విషయంలో చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లకు నిమ్మగడ్డ రమేషఅ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారను.. తనకు ఏది అనిపిస్తే వాటిని అమలు చేయాలని చూస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. అంతేకాదు ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే నిమ్మగడ్డకు మద్దతిచ్చినా, ఆయన చెప్పినట్లు చేసినా మార్చి 31 తర్వాత వారి సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పెద్దిరెడ్డి. నిమ్మగడ్డకు భయపడినా.., ఏకగ్రీవాలకు డిక్లరేషన్ ఇవ్వకపోయినా వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి గుణపాఠం చేస్తామన్నారు. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిర్ణయాలను గౌరవించి పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధంగానే ఉంటున్నాయని.. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏకగ్రీవాలను రద్దు చేయడానికి కమీషనర్ ఎవరని ప్రశ్నించారు. బ్లాక్ మెయిలింగ్ నైజం, అహంకారం ఎక్కువైన వ్యక్తి నిమ్మగడ్డ అని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే చర్యలు తీసుకోకుండా.. మేనిఫెస్టోని రద్దు చేసి మమ అనిపించారన్నారు. చంద్రబాబు ఆలోచనతోనే నిమ్మడ్డ యాప్ ను తీసుకొచ్చారని ఆరోపించిన పెద్దిరెడ్డి.. యాప్ ఎందుకంటూ హైకోర్టే ప్రశ్నించిందన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే వేరే ఎరైనా అయితే రాజీనామా చేసి వెళ్లిపోయేవారని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ చేసేదంతా క్షమించరాని నేరమని.. పాపాలు చేసిన వ్యక్తి పుణ్యక్షేత్రాలు పట్టుకొని తిరుగుతున్నారని  పెద్దిరెడ్డి మండిపడ్డారు.

    ఇక చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు శుక్రవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపాలన్న ఆయన.. నివేదికలు పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు