ANDHRA PRADESH MINISTER KODALI NANI SLAME TELUGU DESHAM PARTY CHIEF NARA CHANDRA BABU NAIDU AND LOKESH OVER BAD PROPAGANDA ON RATION DOOR DELIVERY AND PANCHAYAT ELECTIONS IN STATE HERE ARE THE DETAILS
Kodali Nani: కొడాలి నాని నోట పుతిన్, బైడెన్ మాట.. లోకేష్ గెలిస్తే రాష్ట్రం వదిలిపోతానన్న మంత్రి
మంత్రి కొడాలి నాని (ఫైల్)
దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ డోర్ డెలివరీ (Ration Door Delivery) చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు (TDP Chief nara Chandrababu naidu) తనకు అనుకూలంగా ఉండే మీడియాలో ఫేక్ వార్తలు (Fake news) రాయిస్తూ రాక్షసానందం పొదుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ డోర్ డెలివరీ చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండే మీడియాలో ఫేక్ వార్తలు రాయిస్తూ రాక్షసానందం పొదుతున్నారని ఆరోపించారు. అలాగే ఎన్నికల సమయంలో ఓట్లను లాక్కోవడానికి ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 13వేల పంచాయతీల్లో 11 వేల పంచాయతీలు వైసీపీ సొంతం కావడం ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే నాటికి టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు, లోకేష్ ను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు నాని. తొలి విడతలో తాము 2,640 పంచాయతీలను వైసీపీ సొంతం చేసుకుందన్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో విద్వేషాలు రెచ్చకొట్టేందుకే చంద్రబాబు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని నాని ఆరోపించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రలు సీఎం జగన్ ముందు పనిచేయవన్నారు.
వారికీ లేఖలు రాస్తారు..
ఇక రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు రాసిన లేఖలపై కొడాలి నాని సెటైర్లు వేసారు. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందన్న నాని.. రెండో విడత ఎన్నికలు ముగిసిన వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఐక్యరాజ్యసమితికి కూడా లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ను పిచ్చాసుపత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ ఇవ్వాలని.. చంద్రబాబు ఏం జరిగిందో తాను చెప్పలేనని.. డాక్టర్లే స్పష్టంగా చెప్పగలరని సెటైర్లు వేశారు.
లోకేష్ గెలిస్తే రాష్ట్రం వదిలి పోతా..
ఇక మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ పై కొడాలి నాని పంచ్ లు వేశారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్.. మంగళగిరిలో గెలవలేకపోయారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసే దమ్ము లోకేష్ కు లేదన్నారు. లోకేష్ నిజంగా నాయకుడైతే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. చంద్రబాబును భుజానకెత్తుకున్న నాయకులందరికీ ప్రజలే బుద్ధి చెప్తున్నార.. దేవినేని ఉమా నియోజకవర్గంలో వైసీపీ 44 పంచాయతీల్లో గెలిస్తే టీడీపీ 3 చోట్ల గెలిచిందన్నారు. అలాగే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో 23కే పరిమితమైతే.. వైసీపీ 112 చోట్ల గెలిచిందన్నారు.