• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH MINISTER BUGGANA RAJENDRANATH REDDY NOT SEEN ACTIVE IN RECENT DAYS HERE ARE THE REASONS PRN BK

Andhra Pradesh: ఏపీలో ఆ మంత్రి జాడెక్క‌డ..? ఆయన మౌనం వెనుక కార‌ణాలేంటి..?

Andhra Pradesh: ఏపీలో ఆ మంత్రి జాడెక్క‌డ..? ఆయన మౌనం వెనుక కార‌ణాలేంటి..?

సీఎం జగన్ తో ఆర్ధిక మంత్రి బుగ్గన (ఫైల్)

Buggana Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీలో ఆ నేత కీల‌కం. త‌న స్పీచ్ ల‌తో అప్ప‌టి అధికార‌పార్టీని ప్ర‌తి క్ష‌ణం ఇరుకున పెట్టేవారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీలో ఆ నేత కీల‌కం. త‌న స్పీచ్ ల‌తో అప్ప‌టి అధికార‌పార్టీని ప్ర‌తి క్ష‌ణం ఇరుకున పెట్టేవారు. తీరా పార్టీ త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిత‌ను మంత్రి అయ్యాక కొన్ని రోజులు అదే హాడ‌విడి అదే త‌న‌దైన శైలిని చూపించిన ఆ నేత ఉన్న‌ట్టుండి సైలెంట్ అయిపోయారు. ఆ నేతే త‌న‌దైన పిట్ట‌క‌థ‌ల‌తో అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష పార్టీకి చుక్కులు చూపించే బుగ్గ‌న రాజేంధ్ర‌నాద్ రెడ్డి ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారో అస‌లు ఉన్నారో లేదో అన్న‌ట్లుగా ఉన్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక తాను ఆర్ధిక మంత్రి అయిన త‌రువాత కూడా చాలా అంశాల్లో బుగ్గ‌న గ‌తంలో ఉన్న త‌న జోరునే కొన‌సాగించే వారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల అంశంలో కూడా తానే ముందుండి చంద్ర‌బాబు అండ్ కోం కు చుక్కులు చూపించారు.

    అయితే ఉన్న‌ట్టుండి ఈ నేత సైలెంట్ అయిపోయారు. అస‌లు బుగ్గ‌న సైలెంట్ అవ‌డానికి కార‌ణాలేంట‌నే దానిపై పార్టీలో విసృత చ‌ర్చ జ‌రుగుతుంది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌ర్ కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఆ స్థాయిలో వివాదం జ‌రిగిన‌ప్పుడు కూడా బుగ్గ‌న ఎక్క‌డ క‌నిపించ‌లేదు. మొన్న‌టికి మొన్న ఆల‌యాల‌పై దాడుల వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీ ఇరుకున పెట్టిన‌ప్పుడు కూడా ఆయ‌న నోరెత్తలేదు. కీల‌క అంశాల్లో ఎప్పుడు మీడియా ముందుకు ఈయ‌న్నే పంపిస్తారు అనే టాక్ పార్టీలో బ‌లంగా ఉంది. అయితే ఇలాంటి మేజ‌ర్ ఇష్యూల్లో కూడా ఎందుకు బుగ్గ‌న నోరు మెద‌ప‌లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    ఇది చదవండి: అన్నగారు తమ్ముళ్లను గట్టెక్కిస్తారా..? ఆ హామీ ఓట్లు కురిపిస్తుందా..?



    బుగ్గ‌న ఇంత మౌనంగా ఉండ‌డం వెనుక కార‌ణాల గురించి పార్టీతో పాటు ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మౌనం త‌న‌కు తానుగా అనుకొని ఉన్న‌దా లేక బాస్ నుంచి వ‌చ్చిన ఆదేశాల ప్ర‌కారం ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే త‌న మౌనం వెన‌క బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. పేరుకి ఆర్ధిక శాఖ అయిన‌ప్ప‌టికి త‌న ప‌రిధిలో ఉన్న అంశాల‌పై కూడా నిర్ణ‌యాలు త‌నూ తీసుకునే ప‌రిస్థితిలో లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తోన్నాయి.

    ఈ కార‌ణం వ‌ల‌నే ఆయ‌న స‌చివాల‌యానికి కూడా పెద్ద‌గా రావ‌డం లేద‌ని శాఖ‌కు సంబంధించిన రివ్యూ స‌మావేశాలు ఇంటి నుంచే నిర్వ‌హిస్తోన్నారు. ముఖ్య‌మంత్రి స్థాయి స‌మావేశాలు జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న సీఏం క్యాంపు కార్య‌ల‌యంలో క‌నిపిస్తోన్నారు. మిగిలిన స‌మ‌యాల్లో మొత్తం ఇంటి నుంచే త‌న శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు నిర్వ‌హిస్తోన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు