ANDHRA PRADESH MINISTER BUGGANA RAJENDRANATH REDDY HINTS ABOUT AP JUDICIAL CAPITAL AND HIGH COURT WILL BE BUILT AT JAGANNATHAGUTTA NEAR KURNOOL CITY HERE ARE THE DETAILS PRN
AP High Court: ఏపీ న్యాయరాజధాని అక్కడే... ఏపీ మంత్రి కీలక ప్రకటన... జగన్ పేరుతోనే...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)
Andhra Pradesh Capitals: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుకు తెరవెనుక ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఓ వైపు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం మాత్రం రంగం సిద్ధం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు తెరవెనుక ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఓ వైపు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం మాత్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు తాత్కాలిక అవసరాల కోసం స్థలాలను అన్వేషిస్తోంది. ఇటు న్యాయరాజధాని ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. న్యాయరాజధానిగా కర్నూలును నోటిఫై చేయాలని కోరారు. పార్లమెంటులో కూడా ఈ అంశం చర్చకు రాగా.. సబ్ జ్యుడీషియరీ పరిధిలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుపై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
కర్నూలులో న్యాయరాజధానికి ఏర్పాటు జరుగుతున్నాయని.. హైకోర్టు చీఫ్ జస్టిస్ తో చర్చించిన అనంతరం హైకోర్టు తరలింపును చేయపడ్డాలని బుగ్గన తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి హైకోర్టు నుంచి అనుమతులు రాగానే న్యాయరాజధానికి ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద న్యాయరాధానిని నిర్మిస్తామన్నారు. జగన్నాథగట్టు వద్ద 250 ఎకరాల భూమిని గుర్తించామని అక్కడే హైకోర్టుతో పాటు జ్యూడీషియల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు.
బుగ్గన తాజా ప్రకటనతో మరోసారి మూడు రాజధానుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఅర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా.. మండలిలో ఆమోదం లభించలేదు. ఐతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఐతే ఈ రెండు చట్టాల అమలును నిలిపివేయాలంటూ కొందరు హైకోర్టులు ఆశ్రయించగా.. ధర్మాసనం స్టే విధిచింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విశాఖ ద్వారకా బస్ స్టేషన్ పై అదనపు అంతస్తులు నిర్మించి ఏపీఎస్ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక రిషికొండ ఏరియాలో రిసార్టులు, భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జూన్ మొదటి వారంలో విశాఖపట్నం నుంచి పాలన జరపడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలు పిటీషన్లు కోర్టులో ఉన్నప్పటికి.. రాజధాని తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాలన చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. పాలనకు ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఆయన ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను అందుకు ఎంపిక చేశారని తెలుస్తోంది.
పూర్తిగా అన్ని సదుపాయాలు సమకూరే వరకు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైజాగ్ లో చాలా ప్రదేశాలు పాలనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్ ఉన్నది ప్రభుత్వ స్థలం కావడంతో దిన్నే ఎంపిక చేసినట్లు సీఏంవో వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్తరించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.