హోమ్ /వార్తలు /రాజకీయం /

9న సైకిల్‌కు, 11న ఫ్యాన్‌కు ఓటేయండి... లోకేశ్ కామెంట్స్‌పై వైసీపీ అభ్యర్థి ఆర్కే సెటైర్

9న సైకిల్‌కు, 11న ఫ్యాన్‌కు ఓటేయండి... లోకేశ్ కామెంట్స్‌పై వైసీపీ అభ్యర్థి ఆర్కే సెటైర్

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలంటూ లోకేశ్ మాట్లాడిన మాటలపై ఓ వైపు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటే... దీనిపై మంగళగిరి వైసీపీ అభ్యర్థి, లోకేశ్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ట్విట్టర్‌లో సెటైర్ వేశారు.

ఇంకా చదవండి ...

  తరచూ మాటజారే టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు జడివాన కురుస్తోంది. మొన్నీమధ్యే వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త విని పరిశించిపోయామని వ్యాఖ్యానించి విమర్శలు కొనితెచ్చుకున్న నారా లోకేశ్... తాజాగా ఎన్నికల తేదీ విషయంలో మాట్లాడిన మాటలపై జోకులు పేలుతున్నాయి. ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలంటూ లోకేశ్ మాట్లాడిన మాటలపై ఓ వైపు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటే... దీనిపై మంగళగిరి వైసీపీ అభ్యర్థి, లోకేశ్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ట్విట్టర్‌లో సెటైర్ వేశారు.


  Andhra Pradesh, Andhra Pradesh news, Andhra Pradesh politics, Nara lokesh, satires on nara lokesh comment, YSRCP, tdp, chandrababu naidu, mangalagiri, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నారా లోకేశ్, నారా లోకేశ్ వ్యాఖ్యలపై సెటైర్లు, వైసీపీ, టీడీపీ, చంద్రబాబునాయుడు, మంగళగిరి
  లోకేశ్ కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే సెటైర్లు


  లోకేశ్ చెప్పినట్టు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని... ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన లోకేశ్ ఎలాగైనా మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలవాలని ప్రయత్నిస్తుంటే... లోకేశ్‌ను ఓడించి మరోసారి తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.

  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు