Home /News /politics /

ANDHRA PRADESH LOK SABHA ELECTION RESULT 2019 UPDATES YSRCP LEADING IN 25 SEATS SS

AP Lok Sabha Results: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ సునామీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Andhra Pradesh Lok Sabha Election Result 2019 Updates | రాయలసీమలోని మొత్తం నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. రాయలసీమలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీ లీడింగ్‌లో ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్‌సీపీ సునామీ సృష్టిస్తోంది. మొత్తం 25 స్థానాల్లో వైసీపీ లీడింగ్‌లో ఉంది. టీడీపీ ఒక్కస్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం ఆశ్చర్యకరం. మొదట అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యత చూపించింది.  బాపట్ల, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త ఆధిక్యత చూపించినా ఆ స్థానాల్లోనూ వైసీపీ లీడింగ్‌లోకి వచ్చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 15, వైసీపీ 8, బీజేపీ 2 స్థానాల్లో గెలిచింది.

    నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి


    ఇవి కూడా చదవండి:

    Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

    IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

    Redmi K20: షావోమీ నుంచి మరో ఫోన్... మే 28న రెడ్‌మీ కే20 రిలీజ్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Lok Sabha Elections 2019, Tdp, Ycp, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు