Kodali Nani: ఎన్టీఆర్ కు భారతరత్న.., చంద్రబాబుకు ప్రపంచరత్న… మంత్రి కొడాలి నాని మాటల తూటాలు

ఏపీ మంత్రి కొడాలి నాని(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) రాష్ట్ర మంత్రి కొడాలి నాని (Kodali Nani) మరోసారి రెచ్చిపోయారు. ఎన్టీఆర్ వర్ధంతి (NTR Death Anniversary), హిందూ దేవాలయాలపై దాడులు( Temples Vandalism) సహా పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత చంద్రబాబును (Nara Chandra Babu naidu) టార్గెట్ గా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. ఎన్టీఆర్ వర్ధంతి, హిందూ దేవాలయాలపై దాడులు సహా పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఆయన పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న అంశం., ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు, మహానాడు సందర్భంలోనే చంద్రబాబుకు  గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఎన్టీఆర్ స్క్రీన్ పై నటుడైతే.., చంద్రబాబునాయుడు నిజజీవితంలో పెద్దనటుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బ్రతికుండగా ఎన్టీఆర్ కు భారతరత్న రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం చంద్రబాబు కోసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవర్నైనా వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న.., చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలన్నారు కొడాలి నాని. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఎన్టీఆర్ ను చూసి చంద్రబాబు కూడా తనను తాను పెద్ద నాయకుడిలా అభివర్ణించుకుంటున్నారన్నారు.

    ఎన్టీఆర్ పెట్టిన పార్టీని అక్రమంగా లాక్కున్న చంద్రబాబు.. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారన్నారు. టీడీపీకి తెలంగాణలో 1.29% ఓట్లు రావడానికి చంద్రబాబే కారణమన్నారు. టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపకుడైతే.., చంద్రబాబు, లోకేష్ భూస్థాపితులని ఎద్దేవా చేశారు. ఇక మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విషయంలో చంద్రబాబు వైఖరిని కొడాలి నాని తప్పుబట్టారు. అఖిలప్రియ అరెస్టుపై మాట్లాడే ధైర్యం ఆయనకు లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓటుకు నోటు కేసులో లోపలేస్తారని భయపడుతున్నారన్నారు. ఇదే కిడ్నాప్ ఏపీలో జరిగి అఖిల ప్రియను అరెస్ట్ చేస్తే చంద్రబాబు నటవిశ్వరూపం చూపించేవారన్నారు. అరెస్ట్ తెలంగాణలో జరిగింది కాబట్టే అఖిలప్రియ ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తున్నారని కొడాలి నాని అన్నారు.

    ఓట్ల కోసమే ఆలయాలపై దాడులు
    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మంచి పేరు రాకూడదనే గుళ్లు, గోపురాలపై చంద్రబాబునాయుడు దాడులు చేయిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. డీజీపీ, పోలీసులను టీడీపీ, బీజేపీలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గౌతమ్ సవాంగ్ విజయవాడ సీపీగా ఉన్న సమయంలో కాల్ మనీ కేసులో టీడీపీ నేతల పేర్లు చేర్చినందునే ఆయనపై కక్ష తీర్చుకున్నారన్నారు. అప్పట్లో గౌతమ్ సవాంగ్ కు సీనియారిటీ డీజీపీ పదవి ఇవ్వకుండా పోలీస్ శాఖను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. రాజకీయంగా బతకాలంటే చంద్రబాబుకున్న ఏకైక మార్గం గుళ్లను ధ్వంసం చేయడం., అక్కడికెళ్లి ఆందోళన చేయడమేనన్నారు. హిందువుల ఓట్లు బీజేపీకి వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

    ఇక తిరుపతిలో వైసీపీ అభ్యర్థికి 4లక్షల మెజారిటీ వస్తుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అవకాశం దొరికితే చాలు హిందూత్వ అజెండాను వాడుకుంటోందన్నారు. సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు. ఏపీలో బీజేపీ ఆటలు సాగని..,ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ రథయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published: