టీడీపీ అభ్యర్థికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు

కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి వ్యవహారాలను వైద్యురాలు అయిన ఉగ్రనరసింహారెడ్డి భార్య కవిత చూసుకుంటున్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: March 26, 2019, 5:30 PM IST
టీడీపీ అభ్యర్థికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు
టీడీపీ అధినేత చంద్రబాబు
  • Share this:
మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగనున్న సమయంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు జరగడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న ఈ ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా కేవలం పరిపాలన విభాగానికి చెందిన ఫైళ్లు, సిబ్బందిని మాత్రమే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఈ విభాగంలోకి ఎవరిని అనుమతించడం లేదు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి వ్యవహారాలను వైద్యురాలు అయిన ఉగ్రనరసింహారెడ్డి భార్య కవిత చూసుకుంటున్నారు. అయితే సాధారణంగా ఆస్పత్రులపై ఐటీ దాడులు జరగవని... దీని వెనుక కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని నెలలుగా టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతున్నాయని... ఇది కూడా ఆ కోణంలో జరిగి ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఆ పార్టీ కనిగిరి సీటు కేటాయించింది.


First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు