త్వరలో ఏపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్.. ఛాన్స్ ఎవరికి?

ఏపీ పర్యాటక రంగానికి విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు వీలుగా కొత్త బ్రాండ్ అంబాసిడర్ ను నియమిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

news18-telugu
Updated: June 14, 2019, 5:49 PM IST
త్వరలో ఏపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్.. ఛాన్స్ ఎవరికి?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 5:49 PM IST
లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీకి ఆదాయాన్ని అందించే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే అన్ని శాఖల్లోనూ ఆదాయ మార్గాలను అన్వేషించాలని మంత్రులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంత్రులు ఆ దిశగా దృష్టిసారిస్తున్నారు. ఏపీ పర్యాటక రంగానికి విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు వీలుగా కొత్త బ్రాండ్ అంబాసిడర్ ను నియమిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ ఎన్నడూ లేనంతగా అఫ్రతిష్ట మూటగట్టుకుంది. దీనికి కారణం నదుల్లో జరిగిన బోటు ప్రమాదాలే. ఓ దశలో బోటు ఎక్కాలంటేనే పర్యాటకులు భయపడేంతగా జనం మృత్యువాత పడ్డారు. దీనిపై అప్పట్లో పర్యాటక మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియను అడిగితే నదులు జలవనరులశాఖ పరిధిలో ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయడం మినహా తాము చేయగలిగేందేమీ లేదంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. అయినా ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశంపై ముందుగా దృష్టిసారిస్తోంది.

cm ys jagan mohan reddy sensational comments in ap assembly, సభలో అన్యాయమైన సంప్రదాయాన్ని నేను పాటించను: సీఎం జగన్
సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


నదుల్లో పర్యాటకాన్ని టూరిజం శాఖకు అప్పగించడంతో పాటు పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటక రంగం ఎంతగా అభివృద్ధి చెందినా నేటి కమ్యూనికేషన్ యుగంలో దానికి ప్రచారం లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏపీలో పర్యాటక రంగానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దీనిపై దృష్టిసారించారు. త్వరలో రాష్ట్ర పర్యాటక రంగానికి ఓ ప్రచార కర్తను నియమిస్తామని అవంతి తాజాగా ప్రకటించారు. ఇందుకోసం క్రీడాకారులు, సినీ నటులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వారిని అన్వేషిస్తామని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణలో సినీ నటులు పర్యాటక, చేనేత, ఇతర రంగాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా పలు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో సమాజంలో అత్యంత ప్రభావం చూపగల సినీ నటులను ఎవరినైనా ఏపీ పర్యాటక రంగానికి ప్రచార రంగానికి నియమిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ys jagan speech, cm jagan speech, ys jagan assembly speech, ys jagan speech in assembly, cm ys jagan, ap assembly sessions live, ap assembly live, ys jagan fire on chandrababu, cm chandrababu naidu, telugu news, ఏపీ అసెంబ్లీ సమావేశాలు, వైఎస్ జగన్, అసెంబ్లీలో జగన్ ప్రసంగం, చంద్రబాబునాయుడు, తెలుగు న్యూస్
జగన్ మోహన్ రెడ్డి
వాస్తవానికి పర్యాటకరంగానికి సీఎం జగన్ ఉండగా.. మరో బ్రాండ్ అంబాసిడర్ ఎందుకన్న వాదన వైసీపీ నేతల నుంచి వినిపిస్తోంది. కోట్లాది రూపాయలు చెల్లించి ప్రచార కర్తలను నియమించినా సరైన వ్యూహం లేకపోతే పర్యాటకరంగానికి కొత్తగా వచ్చే ప్రయోజనమేదీ ఉండబోదని నిపుణులు సైతం చెప్తున్నారు. గత అనుభవాలను బట్టి చూస్తే పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రచార వ్యూహాలు, ప్రకటనలు, కార్యక్రమాల రూపకల్పన వంటి వాటిపై సీరియస్ గా దృష్టిపెడితే బ్రాండ్ అంబాసిడర్ల అవసరం అంతగా ఉండకపోవచ్చు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...