• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ANDHRA PRADESH HIGHCOURT ISUUSE NOTICES TO NEW SEC NEELAM SAHNI NGS

Breaking News: ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు

నీలం సాహ్నికి నోటీసులు

ఏపీ ఎస్ఈసీ వ్యవహారం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం.. సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ అన్నట్టుగానే వ్యవహారం కనిపించింది. ఇఫ్పుడు కొత్త ఎస్ఈసీ నియామకమైనా.. కోర్టు నుంచి షాక్ లు తప్పడం లేదు.

  • Share this:
    ఏపీ ప్రభుత్వానికి వరుస షాక్ ల పై షాక్ లు తగులుతున్నాయి. నిన్ననే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతి  రాజు నియామకం చెల్లదని తీర్పిచ్చింది. అలాగే అశోక్ గజపతి రాజును తిరిగిన చైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. తాజాగా ప్రభుత్వం నియమించిన కొత్త ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

    కాగా మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది.

    ఇదీ చదవండి: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే.. స్పష్టత ఇచ్చిన మంత్రి

    ఎస్ఈసీ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్న రేంజ్ లో ఫైటింగ్ సాగింది. ఎన్నికల విషయంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీపై వేటు వేస్తే.. ఆయన న్యాయపోరాటం చేసి మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవిలోకి తిరిగి వచ్చిన తరువాత అనుకన్నట్టే ఎన్నికలు నిర్వహించడమే కాదు.. మంత్రులు బయటకు రాకుండా నిషేదం కూడా విధించే ప్రయత్నం చేశారు. ఇటు ఏపీ ప్రభుత్వం ప్రివిలేజ్ మోషన్ వరకు వ్యవహారం వెళ్లింది.  ఏదీ ఏమైనా ఆయన పదవీ కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం  ఊరట పొందింది. ఇప్పుడు ఏరి కోరి నీలం సాహ్నికి ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీగా అవకాశం ఇచ్చి.. గవర్నర్ తో ఆమోద ముద్ర వేయించుకుంది ప్రభుత్వం..

    ఇదీ చదవండి: విశాఖ నుంచి పాలనకు డేట్ ఫిక్స్.. సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే.. రాజమార్గం ఇలా

    ఇక అంతా సవ్యంగానే ఉంటుంది అనుకున్న సమయంలో కోర్టు ఆదేశాలతో షాక్ లు తగులుతున్నాయి. ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. ఇక ఆమె ఎంపికపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అన్నది చూడాలి..

    ఇదీ చదవండి: ఏపీ సీఎం, మంత్రులకు మంచి జరగాలి.. అమ్మవారికి మొక్కుకున్న అశోక్ గజపతి రాజు.. అసలు వివాదం ఇదే

    ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్‌గా అవకాశం దక్కింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రతిపాదన పంపగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా  బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. తాజాగా నోటీసులు జారీ చేసింది.
    Published by:Nagesh Paina
    First published: