ANDHRA PRADESH HIGH COURT ORDERS TO STOP ELURU MUNICIPAL CORPORATION ELECTIONS BA
Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేసిన హైకోర్టు.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అక్కడ పోలింగ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అక్కడ పోలింగ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లలో మార్చి 10న ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ షెడ్యూల్ జారీ చేయగా, అందులో ఏలూరు కూడా ఉంది. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మార్చి 10న ఏలూరు కార్పొరేషన్లో పోలింగ్ ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని అయిన ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన - బీజేపీలు కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఎంపీ గెలుపొందారు. అాలాగే, ఆళ్ల నాని ఏలూరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు సీఎం జగన్. అక్కడ పట్టు నిలబెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. 2020 మార్చిలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు జరిగాయని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల చేత బలవంతంగా విత్ డ్రా చేయించారంటూ జనసేన పార్టీ ఆరోపించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. 2020లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఏలూరులో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో మార్చి 10న మిగిలిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసిపోయింది. మార్చి 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులకు అతీతంగా జరిగాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ప్రతిపక్ష టీడీపీ కూడా తమ పార్టీ మద్దతు దారులు కూడా భారీ ఎత్తున పంచాయతీల్లో గెలిచారని ప్రకటించింది. ఇక జనసేన పార్టీ కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల గెలిచారంటూ కొన్ని పంచాయతీల పేర్లను రిలీజ్ చేసింది. తమకు పంచాయతీల్లో 27 శాతం ఓట్లు వచ్చాయని తెలిపింది.
మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతున్నాయి. దీంతో నగర జనం ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వైసీపీ బలవంతంగా ప్రత్యర్థి పార్టీల నామినేషన్లను విత్ డ్రా చేయించిందని విపక్షాలు ఆరోపించాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.