TDP Leader Pattabhi gets Bail: టీడీపీ నేత పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

టీడీపీ నేత పట్టాభి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (Kommareddy Pattabhi Ram) కు హైకోర్టులో ఊరట లభిచింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (Kommareddy Pattabhi Ram) కు హైకోర్టులో ఊరట లభిచింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై విజయవాడ (Vijayawada) గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. అనంతరం విజయవాడ కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

    పలువురిపై కేసు
    ఇదిలా ఉంటే ఎన్టీఆర్ భవన్ పై దాడి చేసిన వారిలో 10మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్, శేషగిరి, అడపాల గణపతి, జోగ రమణ, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, పానుగంటి చైతన్య, గోక దుర్గాప్రసాద్, పేరూరి అజయ్, పల్లపు మహేష్ అనే వ్యక్తులను గుర్తించారు. అలాగే టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగిన కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఇది చదవండి: టీడీపీ ఢిల్లీ టూర్.. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఫిక్స్.. మోడీ, షా టైమ్ ఇస్తారా..?



    ఇదిలా ఉండే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్రపదజాలాన్ని వినియోగించారు. దీంతో సీఎం జగన్ ను దూషించారంటూ కొందరు అల్లరిమూకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలసిందే. దీనికి నిరసనగా చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేయగా.. వైసీపీ కూడా జనాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

    ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..



    ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ
    ఇక ఇదే వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సహా సహా 18 మంది నేతల బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనుంది. అదే రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టీడీపీ నేతలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది. రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోజీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం కూడా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతలు, డ్రగ్స్, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనను కూడా విధించాలని కోరనున్నారు.
    Published by:Purna Chandra
    First published: