హోమ్ /వార్తలు /politics /

ZPTC, MPTC Elections: ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.., ప్రభుత్వానికి ఊరట

ZPTC, MPTC Elections: ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.., ప్రభుత్వానికి ఊరట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైకోర్టులో (High Court) ఏపీ ప్రభుత్వానికి (AP Government) ఊరట తక్కింది. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ (Parishat Elections Counting)కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై (Andhra Pradesh Local Body Elections) హైకోర్టు (AP High Court) కీలక తీర్పు ఇచ్చంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ (ZPTC, MPTC Elections Counting) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికల ప్రక్రియను సమర్ధించిన ధర్మాసనం.. కౌంటింగ్ కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఐతే పరిషత్ ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.., సరైన కాలపరిమితి లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం మే 21న న్నికలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission)తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేశారు.

దీనిపై ఆగస్టు 5న విచారణ ముగించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న కొత్త నూతన ఎన్నికల కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న నీలం సాహ్నీ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.

ఇది చదవండి: టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే.. కొత్త సభ్యులు వీళ్లే..2020లో ఎక్కడైతే నిలిచిపోయాయో.. అక్కడి నుంచే ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల ప్రక్రియకు తగిన సమయం లేదని కావున రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిగిన సింగిల్ జడ్జి ధర్మాసనం ప్రక్రియను నిలిపేసింది. ఈ తీర్పును ఎస్ఈసీ సవాల్ చేయగా అనుకూలనమైన తీర్పు వచ్చింది.

ఇది చదవండి: ఏపీలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి..? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..?ఈ ఏడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar).. తగిన సమయం లేదనందున పరిషత్ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య యుద్ధం నడిచింది. అటు రాజకీయంగానూ తీవ్రదుమారం రేపింది. తాను పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వించలేనన్న నిమ్మగడ్డ మార్చి 31న పదవీ విరమణ చేశారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎస్ నీలం సాహ్నీని ఎస్ఈసీగా నియమించింది. ఆమె ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇది చదవండి: రెండు నెలల క్రితం వీడియో.. ఇప్పుడు వైరల్.. అతడికి-ఆమెకు మధ్య ఏం జరిగింది..?కోర్టు తీర్పు వెలువరించడంతో ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన వచ్చే అవకాశముంది. తీర్పు ప్రతిని పరిశీలించిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ తేదీని ప్రకటించనుంది. ఇప్పటికే చాలా స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగిస్తామని ధీమాతో ఉంది. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమంకానుంది.

First published:

Tags: Andhra Pradesh, AP High Court, Ap local body elections

ఉత్తమ కథలు