Home /News /politics /

ANDHRA PRADESH HIGH COURT GIVES GREEN SIGNAL TO MINISTER KODALI NANI OVER PRESS MEETS AND ORDERS THAT TO NOT SPEAK ABOUT STATE ELECTION COMMISSION AND SEC NIMMAGADDA RAMESH KUMAR HERE ARE THE DETAILS

SEC vs Kodali Nani: మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట...కానీ కండీషన్స్ అప్లై...

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సందర్భంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar) కు.. ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులకు మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులకు మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీపై, ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. దీనిపై మంత్రి కొడాలి నాని కోర్టుకు వెళ్లగా.. విచారణ జరిపిన కోర్టు.. గురువారం కీలక ఆదేశాలిచ్చింది. మంత్రికి ఊరటనిస్తూ  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొడాలి నాని మీడీయాతో మాట్లాడొచ్చని .. కొన్ని షరతులు కూడా విధించింది. మీడియాతో అయితే మాట్లాడొచ్చుగానీ ఎస్ఈసీ గురించి గానీ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి గానీ,  ఎన్నికల ప్రక్రియపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

    ఈనెల 12న జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఈసీపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. అదే రోజు ఆయన వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని అందులో పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

    కొడాలి నాని ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ ఆయనపై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్‌మీట్‌లతో పాటు ఎలాంటి మీటింగ్‌లలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. దీనిపై కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఇరువర్గాలు వీడియో ఫుటేజ్ లు సమర్పించాలని ఆదేశించింది.

    ఐతే మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు సమర్పించిన వీడియో టేపులతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. దీంతో పూర్తిస్థాయి వీడియో టేపులను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. ఇదే సమయంలో కేసు మరింత లోతుగా విచారించాలని భావించిన న్యాయస్థానం.. కోర్టుకు సహాయపడేందుకు అమిస్ క్యూరీని నియమించింది.  విచారణ సందర్భంగా వీడియో ఫుటేజ్ లను ధర్మాసనం మరోసారి పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మాడియాతో మాట్లాడటానికి మంత్రికి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు.. ఎన్నికల కమిషనర్ పై మాత్రం మాట్లాడొద్దని  కండిషన్ పెట్టింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP High Court, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Kodali Nani, Local body elections, Nimmagadda Ramesh Kumar, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు