ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మూడు రాజధానులకు (Three Capitals) వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు (Amaravathi Farmers) చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. ఐతే ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకాస ఆధ్వర్యంలో 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు జరిగే యాత్ర షెడ్యూల్ రాజధాని ఐకాస ఖరారు చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర సాగుతుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. టీడీపీతో సహా మరి కొన్ని పార్టీలు వారికి మద్దతుగా నిలిచాయి. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని హామీ ఇస్తేనే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని జనసేన అధినేత పలుమార్లు చెప్పుకొచ్చారు.
ఐతే ప్రభుత్వం మాత్రం రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్న పోలీసులు.., గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించటం కష్టతరమవుతుందని, మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని
ఐతే మహా పాదయాత్ర కు పోలీసులు అనుమతి నిరాకరించటం తో అమరావతి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శుక్రవారం రైతుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.., రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. రైతుల పాదయాత్ర నిరాకరణకు పోలీసులు చూపిన కారణాలు సహేతుకుంగా లేవని ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టు ఎదుట వాదన వినిపించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశముందని వెల్లడించారు. పైగా రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే సమస్య ఉందని వాదించారు. అయితే, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు నివేదించారు. రైతుల వాదనతో ఏకీభవించిన కోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. దీంతో నవంబర్ 1వ తేదీ నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభించనున్నారు.
2019 డిసెంబర్లో ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నానిటి నుంచి ఆమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. మధ్యలో సీఎం, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి యత్నించగా ప్రభుత్వం అదుపుచేసింది. అమరావతికి మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలోకి దిగినా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై ముందుకే వెళ్తోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.