Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు షాక్... రాజుగారికి ఏదీ కలిసి రావడం లేదుగా..

రఘురామ కృష్ణంరాజు(ఫైల్ ఫొటో)

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు (YSRCP MP Raghu Rama Krishnam Raju) ఏపీ హైకోర్టు (AP High Court) షాకిచ్చింది.

  • Share this:
    వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై ఆయనను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐతే తన అరెస్టు అక్రమమంటూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రాధమిక ఆధారాలు, విచారణ లేకుండానే అరెస్ట్ చేశారంటూ రఘురామ కృష్ణంరాజు తరపులాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసినందునే హైకోర్టుకు వచ్చామన్న రఘురామ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. మరోవైపు మంగళగిరి సీఐడీ కార్యాలయంలో రఘురామ కృష్ణంరాజును విచారించిన అధికారులు.. ఆయన్ను గుంటూరు 6వ నెంబర్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది.

    శుక్రవారం హైదరాబాద్ లోని స్వగృహంలో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఆయనపై FIR 12/2021 నమోదు చేసిన అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. రఘురామకృష్ణం రాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ అందులో A1గా రఘురామకృష్ణంరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానళ్లను పేర్కొన్నాయి. సిఐడి డిఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి: రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ ఎఫ్ఐఆర్ ఇదే… ఏ-2, ఏ-3 ఎవరంటే..!


    రఘురామ కృష్ణంరాజుపై అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన సిఐడి.. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలున్నాయని.. అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సీఐడీ స్పష్టం చేసింది. అలాగే కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని రఘురామ కృష్ణంరాజు వ్యవహరించారని పేర్కొంది. TV5, ABN ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొన్న సీఐడీ... ఆయన కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించారని ఆరోపించింది. రఘురామ కృష్ణంరాజుతో కలిసి ప్రభుత్వం టీవీ ఛానళ్ల విషం చిమ్మాయని... అలాగ పక్కా పథకం ప్రకారమే రఘురామ కృష్ణంరాజు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అభియోగాలు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రఘురామ రాజు కుట్ర చేశారని పేర్కొంది.

    ఇది చదవండి: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.., మంత్రి ఏమన్నారంటే..

    రఘురామకృష్ణంరాజు అరెస్టుపై రాజకీయ దుమారం రేగుతోంది.  ఆయన అరెస్టు అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  సీఎం జగన్ కరోనాను వదిలేసి కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు  ప్రభుత్వంపై, సీఎంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: