• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH HIGH COURT DIRECTS STATE ELECTION COMMISSION TO HOLD THE USAGE OF E WATCH APP HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్... e-Watch appపై మరో వారం స్టే

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్... e-Watch appపై మరో వారం స్టే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ఏపీ ప్రభుత్వానికి ఎస్ఈసీ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar) తీసుకొచ్చిన e-Watch appపై తీవ్ర దుమారం రేగింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వానికి ఎస్ఈసీ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొచ్చిన e-Watch appపై తీవ్ర దుమారం రేగింది. యాప్ పై అనుమానాలున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు న్యాయవాదులు హైతోర్టును ఆశ్రయించారు. గతంలో యాప్ పై స్టే ఇచ్చిన హైకోర్టు.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది. యాప్ పై స్టేను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 17న చేపడతామని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా యాప్ ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) నిపుణుల పరిశీలనకు పంపాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో యాప్ ను పరిశీలించిన ఏపీ టీఎస్ నిపుణులు యాప్ అందులోని లోపాలు మరియు భద్రతపై ఎస్ఈసీకి నివేదిక సమర్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. యాప్ ను రూపొందించడానికి సాంఘిక శాఖకు చెందిన సోర్స్ కోడ్ ను వినియోగించినట్లు ఏపీటీఎస్ నిపుణులు నిర్ధారించారు. ఐతే తమ సోర్స్ కోడ్ ను వినియోగించడానికి సాంఘిక సంక్షేమ శాఖ అనుమతులిచ్చిందా లేదా అనే అంశాన్ని చెప్పడానికి ఎస్ఈసీ ఎలాంటి పత్రాలు సమర్పించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో మరింత సమాచారం ఇవ్వాలని ఎస్ఈసీని ఏపీటీఎస్ కోరింది. అనుమతి లేకుండా సోర్స్ కోడ్ ను వినియోగించినట్లయితే సాంఘిక సంక్షేమ శాఖ సైబర్ సెక్యూరిటీకి ముప్పు వచ్చే అవకాశముందన్నారు.

    ఈ క్రమంలో భారత ఎన్నికల కమిషన్ అనుమతిస్తే E-Vigil Appను వినిగించుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన e-Nigha App సరిగా పనిచేయడం ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐతే రాష్ట్రం రూపొందించిన యాప్ ను వినియోగిస్తే ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ లాయర్.. రాష్ట్ర ప్రభుత్వ యాప్ ప్రస్తుత స్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. ఈ యాప్ ను ఎన్నికల కమిషన్ వినియోగించాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
    Published by:Purna Chandra
    First published: