Home /News /politics /

AP Cabient: సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌-1955 చట్టంలో సవరణలకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

AP Cabient: సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌-1955 చట్టంలో సవరణలకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting Update: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓ వైపు హాట్ హాట్ గా సాగడంతో రాజకీయం అంతా అటే టర్న్ అయ్యింది. ముఖ్యంగా చంద్రబాబు అసెంబ్లీకి సీఎం అయ్యేంత వరకు రానని శపథం చేయడం.. ఆ వెంటనే ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవంతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. అదే సమయంలో మరోవైపు ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులకు ఆమోదం తెలిపింది.

ఇంకా చదవండి ...
  AP Cabinet Meeting Update:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుగా.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శపథం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించారనే.. ఉద్వేగానికి లోనైన చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే అసెంబ్లీ నుంచి టీడీపీ (TDP) బయటకు వచ్చిన తరువాత.. చంద్రబాబు తీరుపై అసెంబ్లీలో విమర్శల వర్షం కురిసింది. వ్యవసాయరంగానికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా టీడీపీ అసెంబ్లీలో లేకపోవడం బాధాకరం అన్నారు సీఎం జగన్ (CM Jagan).. ఆ తరువాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు అమోదం తెలిపారు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రి వర్గం చర్చించింది. తరువాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  ఏపీ కేబినెట్‌ ప్రధాన నిర్ణయాలు ఇవే..
  ఈ నెల 29న సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావించే విద్యాదీవెన కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్‌ ఆమోదించింది. అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వేట విషయంలో వెనుకడబి ఉంది అన్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన కొత్త పరిశ్రమలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

  ఇదీ చదవండి: బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందన్నారు.. చంద్రబాబుకి ఇదే ఆఖరి రోజు.. ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది.. రోజా పంచ్ డైలాగ్స్..?

  వీటితో పాటు కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్‌లకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే
  డిక్సన్‌ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్షయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం. మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌-1955 చట్టంలో సవరణలకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  ఇదీ చదవండి: చంద్రబాబు కుంటుంబంపై వ్యాఖ్యలు.. కన్నీరు పై సీఎం జగన్ వివరణ.. ఏమన్నారంటే..?

  ఏపీ హైకోర్టులో మీడియేషన్‌ సెంటర్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు ఒకే చెప్పింది. ఏపీ పంచాయతీ రాజ్‌ యాక్ట్‌-1994లో సవరణలకు, ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టంలో సవరణలకు, ఏపీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌-2021 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్‌ గుడ్‌ ఫండ్‌ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, AP cabinet, Ap cm jagan, AP News, Cm jagan

  తదుపరి వార్తలు