• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH GRAM PANCHAYAT ELECTIONS 2021 DONT VOTE FOR MY SYMBOL CANIDATE VARIETY CAMPAIGN IN EAST GODAVARI SK

Andhra Pradesh: మాకు ఓటు వేయకండి ప్లీజ్.. ఏపీలో ఎన్నికల్లో విచిత్ర ప్రచారం

Andhra Pradesh: మాకు ఓటు వేయకండి ప్లీజ్.. ఏపీలో ఎన్నికల్లో విచిత్ర ప్రచారం

ఏపీ మూడో పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు

AP Panchayat Elections 2021: నాలుగో విడత మొత్తం 3, 299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 553 సర్పంచ్‌ స్థానాలు, 10,921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈ నెల 21న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

  • Share this:
    ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు అష్ట కష్టాలు పడుతుంటారు. నామినేషన్‌లు ముగిసిన తర్వాత.. గుర్తులు వచ్చిన వెంటనే ప్రచారంలోకి దిగుతారు. ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తారు. తమ గుర్తును చూపించి ఈ గుర్తుకే ఓటు వేయాలని కోరుతారు. కానీ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తమకు ఓటు వేయవద్దని ఇద్దరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి గుర్తును చూపించి.. వారికే ఓటు వేయాలని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురులో ఈ సన్నివేశం కనిపించింది.

    మొగలికుదురు గ్రామంలో నాలుగో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ అంతలోనే గ్రామస్తులంతా సమావేశమై ఒక్కరే పోటీలో ఉండాలి తీర్మానించి.. కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు. అందరూ ఆమెకే ఓటు వేయాలని గ్రామస్తులకు చెప్పారు. ఈ నేపథ్యంలలో మిగతా ఇద్దరు నాగలక్ష్మి, వెంటకరమణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు కూడా పోటీలో ఉన్నట్లే లెక్క. ఎన్నికల అధికారులు గుర్తులను కూడా ఖరారు చేశారు. ఇక చేసేదేం లేక, ఆ ఇద్దరు అభ్యర్థులు గ్రామంలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తాము పోటీలో లేమని.. మాకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను చూపించి వీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు.

    ఏపీలో నాలుగో విడతలో 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి నాలుగో విడత మొత్తం 3, 299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 553 సర్పంచ్‌ స్థానాలు, 10,921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈ నెల 21న పోలింగ్‌ నిర్వహించనున్నారు. సర్పంచి స్థానాలకు మొత్తం 7475 మంది, వార్డులకు 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: