రాయలసీమకు జగన్ గుడ్ న్యూస్... ఈనెల 26నే శంకుస్థాపన

అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వ‌మే ప్లాంట్ ఏర్పాటు చేస్తుంద‌ని జీవోలో ప్ర‌భుత్వం.. పేర్కొంది. ప్లాంట్ నిర్మాణం కోసం 250 కోట్లు ప్ర‌భుత్వం.. కేటాయించింది.

news18-telugu
Updated: December 4, 2019, 2:38 PM IST
రాయలసీమకు జగన్ గుడ్ న్యూస్... ఈనెల 26నే శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఉక్కు పరిశ్రమ కోసం ఎన్నో ఏళ్లనుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న రాయలసీమ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. త్వరంలోనే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు జారీ చేసిింది ప్రభుత్వం.  జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని సున్న‌పురాళ్ల‌ప‌ల్లి, పెద్ద నంద‌లూరు గ్రామాల మ‌ధ్య స్టీల్ ప్లాంటు ఏర్పాటు కానుంది. ప్రైవేటు పెట్టుబ‌డిదారుల‌తో స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుచేసేలా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వ‌మే ప్లాంట్ ఏర్పాటు చేస్తుంద‌ని జీవోలో ప్ర‌భుత్వం.. పేర్కొంది. ప్లాంట్ నిర్మాణం కోసం 250 కోట్లు ప్ర‌భుత్వం.. కేటాయించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకోసం ప్ర‌త్యేకంగా కంపెనీ ఏర్పాటు చేస్తూ మ‌రో జీవో జారీ. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో 10 ల‌క్ష‌ల మూలధ‌నంతో కంపెనీ ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం. ...ఈనెల 26న కంపెనీ ఏర్పాటుకు శంఖుస్థాప‌న చేయనున్నారు సీఎం జగన్.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>