Home /News /politics /

ANDHRA PRADESH GOVT ANNOUNCE FINANCIAL INCENTIVES TO UNANIMOUSLY ELECTED PANCHAYATS BA GNT

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేయండి.. భారీ ప్రోత్సాహకం పొందండి.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో తాజాగా పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా ప్రోత్సహిస్తోంది. పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు నిధులు లభిస్తాయి. 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది.

    ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు. నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ.. మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

    రేషన్ డోర్ డెలివరీ పథకం వాయిదా

    పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభోత్సవం రద్దైంది. ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా కదిరిలో సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడినట్లైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి కొత్తపథకాలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ కార్యక్రమానికి ఏదీ కలిసిరావడం లేదు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్ డౌన్, ఆ తర్వత కొత్తకార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Gram Panchayat Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు