MLC for Anandaiah: ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి...? గవర్నర్ సిఫార్సు.. అసలు నిజం ఇదే...!

బొనిగి ఆనందయ్య (ఫైల్)

కరోనా నివారణకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు (Krishnapatnam Anandaiah) దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Share this:
    కరోనా నివారణకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆనందయ్య మందు పంపిణీ అవుతోంది. కరోనాకు దివ్యఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్న ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా.. సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖరాయడం సంచలనంగా మారింది. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నరి బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తన ఆయుర్వేద ఔషదంతో కొవిడ్-19 నివారణకు కృషి చేసిన ఆనందయ్యను రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3), 171(5) ప్రకారం ఆయనను ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని అందులో పేర్కొన్నారు.

    ఐతే ఈ లేఖపై అటు గవర్నర్ కార్యాలయంగానీ.. ఇటు ఆనందయ్యగానీ స్పందించలేదు. అసలు ఆనందయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఉందా..? లేదా..? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పాటు ప్రతిపక్షలకు చెందిన వారు కూడా కృష్ణపట్నంకు క్యూకట్టారు. కొన్ని రోజుల పాటు ఆనందయ్య కేంద్రంగానే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న సందర్భాలున్నాయి. ఒకరిద్దరు మంతురులు కూడా ఆయన్ను కలిసి మందు తయారీ, పంపిణీ గురించి ఆరాతీశారు. ఆనందయ్యను ప్రభుత్వం నిర్బంధిస్తోందని... రహస్య ప్రాంతంలో ఉంచి అధికార పార్టీ నేతలు మందు తయారు చేయించుకున్నారంటూ కొన్ని పార్టీల నేతలు విమర్శించారు. గతంలో అర్ధరాత్రి సమయంలో ఆనందయ్యను పోలీసులు తరలించడం కూడా సంచలనంగా మారింది.

    Krishnapatnam Anandaiah, MLC for Anandaiah, Anandaiah Medicine, Anandiah, Andhra Pradesh Governor Biswabhushan Harichandan, Andhra Pradesh Government, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu news, కృష్ణపట్నం ఆనందయ్య, ఆనందయ్యకు ఎమ్మెల్సీ, ఆనందయ్య, ఆనందయ్య మందు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు,
    సీఎస్ కు గవర్నర్ కార్యదర్శి రాసిన లేఖ

    ఈ విషయంలో కూడా భార్యతో గొడవపడాలా...? అకారణంగా ప్రాణం పోయిందే..!


    ఒక్కసారిగా ఆనందయ్యకు పాపులారిటీ రావడంతో కొందరైతే ఆనందయ్య మందును సొంత ఫోటోలు వేసుకొని పంపిణీ చేశారు. ఐతే ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవిస్తున్నారన్న ప్రచారం వెలుగులోకి రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆనందయ్యకు ఎమ్మెల్సీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలో పదవులకు పోటీ పెరగడంతో ఆనందయ్యకు జగన్ అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఆనందయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

    ఇది చదవండి: పాలిటిక్స్ లోనే కాదు చదువులోనూ టాపర్.. స్టూడెంట్ నెం.1గా ఎమ్మెల్యే.. ప్రతిష్టాత్మక సంస్థలో సీటు

    Published by:Purna Chandra
    First published: