ANDHRA PRADESH GOVERNMENT TO FORM THREE NEW DISTRICTS SOURCES NK
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు?
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 25 జిల్లాలు ఉండాలన్నది ఓ ప్రతిపాదన. ఐతే... అది అలా ఉంచి... ముందుగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. అతి త్వరలో అవి 16 జిల్లాలు కాబోతున్నాయి. ఎందుకంటే ఆఘమేఘాలపై 3 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే... 3 కొత్త జిల్లాల ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఐతే... జిల్లాల ఏర్పాటు జరగబోతోందని ఇప్పటికే కొంతమంది వైసీపీ మంత్రులు ఫీలర్స్ రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల ఈ మూడు జిల్లాల ఏర్పాటు జరగబోతోందని తెలిసింది. ఈ మూడే ఎందుకు అంటే... మచిలీపట్నం, అరకు, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమధ్య ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలంటే... రూ.600 కోట్ల దాకా ఖర్చవుతుంది. ఐతే... బాగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే... వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)... ఇస్తుంది. అంటే... మొత్తం రూ.1800 కోట్లు అవుతుందనుకుంటే... MCI నుంచీ రూ.1080 కోట్లు వస్తాయి. ఫలితంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.720 కోట్లే అవుతుంది. అసలే ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. అప్పులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అందువల్ల పొదుపులు చేసేందుకు వీలయ్యే అన్ని మార్గాల్నీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో MCI నుంచీ మనీ పొందేందుకు ఆ మూడు ప్రాంతాల్నీ జిల్లాలుగా మార్చనున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతాల్ని జిల్లాలు చెయ్యాలనే డిమాండ్ ఆల్రెడీ ఉంది. అందువల్ల వాటిని చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేబినెట్లో చర్చించి... చేసేద్దామని అనుకున్నట్లు తెలిసింది. అందువల్ల 25 జిల్లాల ఏర్పాటు సంగతి అలా ఉంచితే... ముందుగా మూడు జిల్లాలు మాత్రం ఏర్పాటు కాబోతున్నాయని సమాచారం.
నిజామాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.