ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో 63000 ఉద్యోగాల భర్తీ... ఇవీ వివరాలు...

Andhra Pradesh : చెప్పేదొకటి... చేసేది మరొకటి అయితే... అలాంటి ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మరు. వైసీపీ ప్రభుత్వం చెప్పేది మాత్రమే చేస్తున్నామంటూ... 63000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: February 1, 2020, 12:12 PM IST
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో 63000 ఉద్యోగాల భర్తీ... ఇవీ వివరాలు...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
Andhra Pradesh : గత టీడీపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో గ్రాఫిక్స్ చూపిస్తూ... లేనివి ఉన్నట్లుగా చెబుతూ... ప్రజల్ని మభ్యపెట్టిందంటున్న వైసీపీ ప్రభుత్వం... తాము మాత్రం జస్ట్ 4 పేజీల మేనిఫెస్టో ప్రకటించి, అందులో చెప్పినవి చెప్పినట్లే అమలు చేస్తున్నామని అంటోంది. తాజాగా ఫిబ్రవరి ఒకటిన (ఇవాళే)... రాష్ట్రవ్యాప్తంగా ఇంటికే పెన్షన్ స్కీం తెచ్చిన ప్రభుత్వం మరో శుభవార్తను ఏపీ యువత కోసం తెచ్చింది. ఏంటంటే... ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో సుమారు 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు వివరించింది. ఐతే... ఈ పోస్టుల్ని తగ్గించకుండా... ఇలాగే ఉంచి... వీటితోపాటూ... మరిన్ని అదనపు ఖాళీలను కూడా భర్తీ చేయించాలని ప్రభుత్వం డిసైడైనట్లు తెలిసింది. అందువల్ల త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతానికి అధికారులు... ఏయే శాఖల్లో ఏయే ఖాళీలున్నాయో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ఎండాకాలం అయిపోతే... మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ విజయవంతం కావాలంటే వైద్య, విద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీల భర్తీ ఉండేలా ప్రణాళికలు రెడీ చెయ్యమని అధికారుల్ని కోరారు. అందువల్ల వారు ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా 19000, డీఎస్సీ ద్వారా 21000 పోస్టుల్ని, పోలీస్ శాఖలో 13,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే ఈ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో రిలీజ్ చేసి... తిరిగి వానాకాలం వచ్చే లేపు భర్తీని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చెయ్యడం వల్ల... కొత్తగా ఇంటర్, డిగ్రీ చేసిన విద్యార్థులు సైతం... ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా విద్యార్థులు... తమ పరీక్షలు పూర్తవగానే... వేసవి సెలవుల్లో ప్రభుత్వ పోస్టులకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: February 1, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading