Home /News /politics /

ANDHRA PRADESH GOVERNMENT TENSION ON LEAKAGE ISUUES AND STRICT ORDERS TO ALL OFFICIALS NGS BK

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంలో లీకేజ్ రాయుళ్లు.. ఎలా ఆపాలో తెలియక టెన్షన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

AP Government: ప్రభుత్వ పాలనలో చాలా గోప్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. అవే విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. అసలు ఆ విషయాలను లీక్ చేస్తున్నది ఎవరు.? ప్రభుత్వ పెద్దలు గుర్తించారా..?

    M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18,

    Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీసుకొనే నిర్ణయాలు చాల గోప్యాంగా ఉంటాయి. తరచూ చేసే సమీక్షల్లో కొన్ని రహస్య అంశాలను బయటకు రానియ్యరు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కార్ లో రహస్యాలు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాలను సైతం బయట పొక్కి రచ్చ రచ్చ అవుతున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక పరమైన అంశాలు లీక్ అవ్వడమే. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) జరిపిన రివ్యూలు.. అధికారులకు చేసిన సూచనలు సైతం లీయుళ్లు బయపెడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు లీక్ లు చేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ లీకు రాయుళ్ల వల్లే.. రాష్ట్రం చేస్తున్న అప్పులు, తప్పులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి..

    విపక్షాల విమర్శలకు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే.... వారు వేస్తున్నవిమర్శల బాణాలకు వివరణ ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కానీ.... ఇబ్బంది కానీ వచ్చే  పరిస్థిలి లేదు. రాజకీయంగానూ ఎలాంటి డ్యామేజ్ ఉండదు.

    ప్రభుత్వ పాలనకు ఇవ్వాల్సిన సమయమంతా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు (Opposition parties) కేటాయించాల్సి వస్తుంది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ప్రభుత్వ జీవోలకు సంబంధించిన చిన్న డాక్యుమెంట్ (Govenment Go copies) దొరికిన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. దింతో ప్రభుత్వానికి తలనొప్పి మాత్రం తగ్గడం లేదు.

    ముఖ్యంగా ఫైనాన్సియల్ విషయాలను సైతం టాప్ సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అధికారులకు వచ్చిన ఆదేశాల్లో కొన్ని కీలకాంశాలు ఉన్నాయట.

    సీఎం జగన్ తరచు ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వస్తు ఉంటారు. సీఎం దగ్గర జరిగే ఆర్థిక పరమైన చర్చ బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని క్లియర్ గా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి., వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లుల గురుంచి సీఎంతో జరిగే సమావేశంలో కాకుండా.... విడిగా ముఖ్యమంత్రి లేదా... సీఎం పేషీ లతో సదరు శాఖ అధికారులు విడివిడిగా చర్చించాలని సూచించారట.

    సమీక్షా సమయంలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చిన కాపీలు బయటకు రావడం.. అక్కడ నుంచి తలనొప్పులు ప్రారంభం అవుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించారు. నిధులలేమి., పెండింగ్ బిల్లుల సమస్యల ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవర్ పాయింట్ రూపంలో ఎక్కువగా లీక్ అవుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు.

    దింతో సమస్య అక్కడ నుంచే పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలు అడుగులు వేస్తున్నారు. అత్యంత సీక్రెట్ గా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లేకుండా రావాలనే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.

    పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తప్పనిసరి అయితే పూర్తైన వెంటనే డిలేట్ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ (Praveen Prakash)  స్వయంగా ఈ సూచలను అధికారులకు అందించినట్టు చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రావాల్సిన అంశాలు బయటకు రాకుండా ఉంటాయా..? అనే చర్చ కూడా జరుగుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు