ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా దిశ చట్టంపై జగన్ సర్కార్ ఓ స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసింది. దాదాపుగా 9 నిమిషాల విడిదిగల పాటలో దిశ చట్టంపై అవగాహన కల్పించారు. ఏదైనా ఆపద వస్తే ఆడవాళ్లు ఎలా స్పందించాలో కూడా ఈ పాటలో వివరించారు. ‘మహిళ... ఓమహిళ అంటూ పాట మొదలవుతోంది’. అంతే కాకుండా ఆడవారిపై మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లో కఠిన శిక్షలు పడతాయన్న విషయాన్ని కూడా పాట రూపంలో వివరించారు. దిశ చట్టం కోసం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్ డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళలకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారు.
దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదైనా... అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన సాక్ష్యాధారాలు ఉంటే... దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేంద్రం తాజాగా దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆ చట్టాన్ని ఆమోదించకుండా తిరిగి ఏపీకి పంపింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.