JANASENA vs YCP: పవన్ శ్రమదానానికి నో పర్మిషన్..జనసేన-వైసీపీ మధ్య ముదురుతున్న వార్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), జనసేన పార్టీల (Janasena Party) మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ఏపీ ప్రభుత్వ (AP Government) అధికార పార్టీపై జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విమర్శలు చేస్తుండగా.. అదేస్థాయిలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కు కౌంటర్ ఇస్తున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), జనసేన పార్టీల (Janasena Party) మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం (AP Government) అధికార పార్టీపై జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విమర్శలు చేస్తుండగా.. అదేస్థాయిలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక గత కొంతకాలంగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం చేస్తోంది. ఇటీవల రోడ్లను బాగుచేయాలంటూ సోషల్ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టింది. తాజాగా అక్టోబర్ 2వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రోడ్లను మరమ్మతులు చేసేందుకు శ్రమదానం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను కూడా రెండు చోట్ల పాల్గొంటానని ప్రకటించారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

  అక్టోబర్ 2వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీపై, అనంతపురం జిల్లా కొత్తచెరువలో పవన్ శ్రమదానం చేస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ పర్యటనకు జనసైనికులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐతే కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రేక్ వేశారు. బ్యారేజీపై మరమ్మతులు చేయడానికి వీల్లేదని.. గుంతలు పూడిస్తే బ్యారేజీ నష్టమని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా బ్యారేజీపై ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని.. అది ఇరిగేషన్ శాఖ బాధ్యతని చెబుతున్నారు.

  ఇది చదవండి: పవన్ కంటే ఒకరోజు ముందే రాజమండ్రికి చిరంజీవి... కారణం ఇదే..!


  మరోవైపు జనసైనికులు మాత్రం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిననా తాము మాత్రం బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని చెబుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమను అడ్డుకోవాలని అధికార పార్టీ చూస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు. దీంతో అక్టోబర్ 2న ధవళేశ్వరం వద్ద ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

  ఇది చదవండి: పండగ చేసుకుంటున్న ఏపీ మత్స్యకారులు.. కారణం ఇదే..!


  గతంలో రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై జనసేన కవాతు సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పవన్ పిలుపునిచ్చిన కవాతుకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు రావడంతో అనుమతిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. అంతమంది వస్తే బ్రిడ్జి దెబ్బతింటుందని.. అందువల్ల అనుమతి లేదని తెలిపింది. తీవ్ర ఉత్కంఠ నడుమ పరిమిత సంఖ్యలోని అభిమానులతో పవన్ కవాతు నిర్వహించారు. మరిప్పుడు కాటన్ బ్యారేజీ విషయంలో అధికారులు ఎలాంటి ముగింపునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  ఇది చదవండి: ఆ విషయంలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత..? మొదటికే మోసం రానుందా..?


  ఇటీవల పవన్ కల్యాణ్ కు, మంత్రులకు మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్నసంగతి తెలిసిందే. సినిమా ఆన్ లైన్ టికెట్ల విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పేర్నినాని తీవ్రంగా స్పందించగా.. పవన్ కల్యాణ్ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కులాల వెనుక ఉండి రాజకీయం చేస్తే బయటకు లాక్కొచ్చికొడతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు, లిక్కర్ షాపులు, ఇసుక లాంటి సమస్యలపై వరుస పోస్టులు చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: