తిరుమలలో అన్యమత ప్రచారంపై ఏపీ సర్కారు సీరియస్.. విచారణకు ఆదేశం..
Tirumala Bus Ticket: ప్రభుత్వం తిరుమల బస్ టికెట్‌పై అన్యమత ప్రచార వ్యవహారంపై సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు.

బస్ టికెట్‌పై హజ్, జెరూసలేం యాత్ర యాడ్స్
- News18 Telugu
- Last Updated: August 23, 2019, 3:54 PM IST
తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రకటనలపై శ్రీవారి భక్తులు సహా పలువురు భగ్గుమన్నారు. తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్నా హజ్, జరూసలేం యాత్రలపై ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, స్వరూపానందేంద్ర స్వామి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలా కుట్రలు పన్నేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ స్వయంగా ఈ విషయంలో కలుగ జేసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అన్యమత ప్రచారం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు.

Loading...