• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT FILES PETITION TO BAN E WATCH APP RELEASED BY STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR PRN

SEC vs YSRCP: అది టీడీపీ యాప్... నిమ్మగడ్డపై మరోసారి కోర్టుకెళ్లిన వైసీపీ సర్కార్

SEC vs YSRCP: అది టీడీపీ యాప్... నిమ్మగడ్డపై మరోసారి కోర్టుకెళ్లిన వైసీపీ సర్కార్

నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ (ఫైల్ ఫొటో)

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Election Commissoner Nimmagadda Ramesh Kuamr)కు మధ్య యుద్ధం కొనసాగుతోంది.

  • Share this:
    పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించిన E-వాచ్ యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం... యాప్ ను నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. యాప్ వినియోగంపై స్టే ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. ఇప్పటికే  పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన యాప్ లు ఉండటే ప్రత్యేకంగా యాప్ ను డిజైన్ చేయాల్సిన అవసమేంటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వంతో సంప్రదించకుండా రూపొందించిన యాప్ పై తమకు అభ్యంతరాలున్నాయని పేర్కొంది.

    భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

    ఎస్ఈసీ విడుదల చేసిన యాప్ పూర్తిగా ప్రైవేట్ యాప్ అని.. దీనిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికలకు వినియోగించడం సరికాదని ప్రభుత్వం వాదిస్తోంది. ఐతే లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు అంగీకరించని కోర్టు.. గురువారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మరోవైపు వైసీపీ నేతలు యాప్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూపొందించారన్న అనుమానం ఉందని.. అలాగే దాడులకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అధికార పార్టీపై నెట్టే ప్రయత్నాలు జరగొచ్చని విమర్శిస్తున్నారు.

    E-వాచ్ యాప్ పై ప్రభుత్వం, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖండించారు. ఎన్నికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించేందుకే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామన్నారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు. యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇందులో కొత్తగా ఏమీ లేదని.. టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిమ్మగడ్డ వివరించారు. ఇక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు చురుగ్గా ఉన్నారన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు