ANDHRA PRADESH GOVERNMENT COUNTERS HIGH COURT VERDICT ON PANCHAYAT ELECTIONS STATED THAT COVID VACCINATION IS UNDERWAY PRN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం.., ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పిటిషన్
పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణపై దుమారం కొనసాగుతోంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దుమారం కొనసాగుతోంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను పిటిషన్లో చేర్చింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారన్న అంశాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.
ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 23వ తేదీ నుంచే నోటిఫికేషన్ మొదలుకానుండటంతో ప్రభుత్వ పిటిషన్ పై రేపే విచారణ జరిగే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంప్లీడ్ అవనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైకోర్టు తీర్పుపై ఉద్యోగల సంఘాల నేతలు మండిపడ్డారు. ఎస్ఈసీకి ప్రజల ఆరోగ్యం, ఉద్యోగుల సంక్షేమ పట్టదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. అలాగే వ్యాక్సినేషన్ లో బిజీగా ఉన్నందున ఉద్యోగులు విధుల్లో పాల్గొనలేరని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సిబ్బందితో భేటీ అయ్యారు. ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే త్వరోనే సీఎస్ తో పాటు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు దఫాల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.