Home /News /politics /

ANDHRA PRADESH GOVERNMENT ADVISOR SAJJALA RAMA KRISHNA REDDY MADE SENSATIONAL ALLEGATIONS ON CHANDRABABU NAIDU AND QUOTES TDP LEADERS GOING TO DEMOLISH VANGAVEETI RANGA STATUES SOON PRN

Sajjala Comments: చంద్రబాబు తర్వాతి టార్గెట్ వంగవీటి రంగా... మరో బాంబు పేల్చిన వైసీపీ

చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు

చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ ఆలయాలపై జరిగిన దాడుల విషయంలో రాజకీయ పార్టీల (AP Politics) మధ్య తారాస్థాయిలో యుద్ధం నడిచింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ ఆలయాలపై జరిగిన దాడుల విషయంలో రాజకీయ పార్టీల మధ్య తారాస్థాయిలో యుద్ధం నడిచింది. ఇప్పుడు ఆలయాల టాపిక్ కాస్తా విగ్రహాల వైపుకు మళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హస్తముందని ఆరోపించిన సజ్జల.. తాజాగా మరో బాంబు పేల్చారు. త్వరలో రాష్ట్రంలో నాయకుల విగ్రహాలు ధ్వంసం కాబోతున్నాయని జోస్యం చెప్పారు. అంతేకాదు ఈ విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన వ్యూహరచన టీడీపీ కార్యాలయంలోనే జరుగుతుందని ఆరోపించారు. ఇక నుంచి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు.

    టార్గెట్ వంగవీటి రంగా
    తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. చంద్రబాబు జాతీయ నాయకులు, రాజకీయ నాయకుల విగ్రహాలను టార్గెట్ చేశారని.. ఇందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాలు ధ్వంసం కాబోతున్నాయని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ ముఖ్యనేతలకు అత్యంత రహస్యంగా ఆధేశాలిచ్చారని త్వరలో అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వంసం చేసి దళితులు-కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై పటిష్ట నిఘా ఉండటంతో చంద్రబాబు దృష్టి నాయకుల విగ్రహాలపై పడిందన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వంగవీటి రంగా విగ్రహాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబుకు విధ్వంసాలు జరగనిదే నిద్రపట్టదని సజ్జల ఆరోపించారు.

    అదంతా నాటకమే..
    విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై జరిగిన దాడిపై స్పందించిన సజ్జల.. చంద్రబాబు చేసిన అతి చూస్తుంటే వారే కావాలని దాడి చేయించుకున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఓ సాదాసీదా నేతపై దాడి జరిగితే చంద్రబాబు లాంటి వ్యక్తి అక్కడికెళ్లి పూనకం వచ్చినట్లు ఊగిపోవడమేంటని ప్రశ్నించారాయన. ఇక అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి దిగినందునే అరెస్ట్ చేశారే తప్ప ఇందులో వైసీపీ ప్రమేయం లేదన్నారు. కుటుంబాల మధ్య గొడవను పార్టీకి అంటగడుతున్నారని విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను తాను టీడీపీ కార్యకర్తగా నిరూపించుకోవడానికి రోజుకో రకంగా ప్రయత్నిస్తున్నారన్న సజ్జల... సర్పంచ్ అభ్యర్థి భర్త చనిపోతే ఇంటికెళ్లి పరామర్శించడమేంటన్నారు. ఆరుగురు పోటీ చేసిన గ్రామంలో ఏకగ్రీవం కోసం బలవంతం చేసే పరిస్థితి ఎందుకొస్తుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఈసీ రూపొందిస్తున్న యాప్ పైనా అనుమానాలున్నాయని సజ్జల స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Ap government, Ap local body elections, AP News, AP Politics, AP Temple Vandalism, Chandrababu naidu, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar, Sajjala ramakrishna reddy, Tdp, Vijayawada, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు