Tirupathi By-poll: తిరుపతిలో జనసేన-బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్..? సస్పెన్స్ కు తెరపడినట్లేనా..?

తిరుపతి బీజేపీ-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడి నడుస్తోంది. అన్ని పార్టీల్లో పల్లెపోరులో తమ పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. అన్ని పార్టీల్లో పల్లెపోరులో తమ పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. వీటికి భిన్నంగా జనసేన-బీజేపీ పార్టీలు తిరుపతి లోక్ సభస్థానానికి జరిగే ఉపఎన్నికపై దృష్టి పెట్టాయి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతూనే.. తిరుపతి బైపోల్ కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టాలనేదానిపై ఇంతవరకు ఏకాభిప్రాయం రాలేదు. ఐతే ఈ విషయంలో ఒకడుగు ముందుకేసిన బీజేపీ.. తిరుపతి బరిలో తమ పార్టీ అభ్యర్థే పోటీ చేస్తారని ప్రకటించింది. అటు జనసేన కూడా పోటీపై గట్టిగానే పట్టుబట్టింది. దీంతో ఇద్దరకి ఆమోదయోగ్యమైన వ్యక్తిని నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    ఇందులో భాగంగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ., కర్ణాటక కేడర్ ఐఏఎస్ గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమెకు ఫైర్‌ బ్రాండ్‌ ముద్రకూడ ఉంది. పేరొందిన రత్నప్రభ అయితేనే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఉభయ పార్టీలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    Tirupathi By-poll, Janasena Party, Bharathiya Janatha Party, Andhra Pradesh, Pawan Kalyan, Somu Veerraju, IAS Ratna Prabha, YSRCP, Panabaka Laxmin, TDP, YCP Candidate dr.Gurumurthy , తిరుపతి ఉపఎన్నిక, జనసేన పార్టీ, భారతీయ జనతాపార్టీ, ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్, సోమూ వీర్రాజు, IAS రత్నప్రభ, కర్ణాటక, వైఎస్ఆర్సీపీ, పనబాక లక్ష్మి, టీడీపీ, డాక్టర్ గురుమూర్తి,
    మాజీ ఐఏఎస్ రత్నప్రభ (ఫైల్)


    దీనిపై అటు బీజేపీ గానీ, ఇటు జనసేనగానీ స్పష్టత ఇవ్వకపోయినా రత్నప్రభే పోటీ చేస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. 2017 నుంచి ఏడాది పాటు కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభ.., 2018లో రిటైర్ అయ్యారు. అనంతరం 2019లో బీజేపీలో చేరారు. ఐతే ఆమె కర్ణాటక బీజేపీలో చేరి అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. 37ఏళ్లపాటు కర్ణాటకలోనే పనిచేసిన ఆమె ఏపీకి వచ్చి పోటీ చేస్తారా? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

    గతంలో బీజేపీ తరపున ఓ మాజీ మంత్రి పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. సదరు నేత గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రిజర్వేషన్ కూడా కలిసి రావడంతో తిరుపతి బరిలో నిలవాలని ఆ మాజీ మంత్రి గట్టిప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ జనసేన అభ్యంతరం తెలపడంతో బీజేపీ అధిష్టానం కూడా వెనక్కితగ్గినట్లు సమాచారం. ఇప్పుడు మాజీ ఐఏస్ రత్నప్రభ పేరు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించగా., అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికపై గత రెండు రోజుల్లో రెండుసార్లు సమావేశమైన ఇరుపార్టీల ముఖ్యనేతలు అభ్యర్థిపై నిర్ణయాన్ని మాత్రం పెండింగ్లోనే ఉంచారు.
    Published by:Purna Chandra
    First published: