ANDHRA PRADESH EX CHIEF MINISTER NARA CHANDRABABU NAIDU AND TDP MLA NANDAMURI BALAKRISHNA VISITS SUPER STAR KRISHNA RESIDENCE DUE TO HIS WIFE VIJAYA NIRMALA DEMISE TA
కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ..
కృష్ణ కుటుంబానికి చంద్రబాబు, బాలకృష్ణ పరామర్శ
ప్రముఖ దర్శకురాలు, నటి.. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఈ బుధవారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. తాజా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ కృష్ణ కుటుంబ సభ్యలును పరామర్శించారు.
ప్రముఖ దర్శకురాలు, నటి.. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఈ బుధవారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విజయ నిర్మల మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే కదా. ఇక విజయ నిర్మల మృతికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే కమ్ సినీ నటుడు బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి..నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి వచ్చి పరామర్శించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ బుద్దా వెంకన్నతో పాటు కృష్ణ ..పెద్దల్లుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.
విజయ నిర్మలకు నివాళులు అర్పించిన నారా చంద్రబాబు దంపతులు (ట్విట్టర్ ఫోటో)
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విజయ నిర్మాల మరణ వార్త విని షాక్కు గురైనట్టు చెప్పుకొచ్చారు. సినిమాల పరంగానే కాకుండా.. రాజకీయంగా విజయ నిర్మల తమ పార్టీ సన్నిహితురాలిని చెప్పారు. గతంలో 1999 ఎన్నికల్లో విజయ నిర్మల కైకలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు బాలయ్య కూడా తన తండ్రితో విజయ నిర్మల నటించిన చిత్రాలతో పాటు దర్శకురాలిగా ఆమె గొప్పతనాన్ని కొనియాడారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.