చీరాలలో టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి..

చీరాలలో టీడీపీ నాయకుడు కరణం వెంకటేష్ అనుచరుడు గోగులమూడి రాజశేఖర్ మీద ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు.

news18-telugu
Updated: April 10, 2019, 5:54 PM IST
చీరాలలో టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి..
వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన రాజశేఖర్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఏపీలో అధికార విపక్షాల మధ్య ఎన్నికల యుద్ధం మైక్‌లు దాటి కత్తుల వరకు వచ్చింది. చీరాలలో టీడీపీ నాయకుడు కరణం వెంకటేష్ అనుచరుడు గోగులమూడి రాజశేఖర్ మీద ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో రాజశేఖర్‌కు గాయాలయ్యాయి. దీంతో వెంటనే మరికొందరు టీడీపీ కార్యకర్తలు బాధితుడిని చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో దాడి చేసి గలదా మనోజ్, వెంకటేష్‌ చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అనుచరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
చీరాల ఏరియా ఆసుపత్రిలో బాధితుడు.. రాజశేఖర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. దాడికి కారణం ఏంటనే అంశంపై ఆరా తీస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి కరణం బలరాం పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 10, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading