ఏపీలో ఎన్నికల ఫలితాలు ఆలస్యం.. బాంబు పేల్చిన ద్వివేదీ

ప్రతీకాత్మక చిత్రం

మే 15 నుంచి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ఆ తరువాత వారికి విధులను అప్పగిస్తామని ద్వివేదీ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో సౌలభ్యాన్ని బట్టి 10 నుంచి 15 వరకూ కౌంటింగ్ టేబుళ్లుంటాయని చెప్పారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ ప్రకటించారు. కొన్నిచోట్ల మే 23 అర్థరాత్రి తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌లోని స్లిప్పులను కూడా లెక్కించాల్సి రావడంతో కౌంటింగ్ సమయంలో అధికారిక ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ద్వివేదీ తెలిపారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైతే, మధ్యాహ్నానికే ట్రెండ్ తెలుస్తుందని, కానీ, పూర్తి ఫలితాలు రావడానికి అర్ధరాత్రి దాటే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను మొత్తం 24వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటున్నారు. వీరికి అదనంగా మరో 3వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరు ఏ నియోజకవర్గంలోని ఓట్లను లెక్కిస్తారనే విషయం చివరి వరకు రహస్యంగా ఉంటుందని ద్వివేదీ తెలిపారు.

  ap election results,ap election survey,ap elections 2019,ap elections survey,ap elections,ap news,ap elections results,ap elections results 2019,ap politics,election results,ap election results 2019,ap election news,ap elections 2019 results,ap results,ap next cm,election results 2019,ap election survey 2019,ap election results on,ap results 2019,ap election results on may 23,AP CEO Dwivedi,Dwivedi on results,AP Counting,Chandrababu Naidu,YS JaganMohan Reddy,Pawan Kalyan,చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాన్,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఏపీ ఎన్నికల సర్వేలు,ఏపీ ఎన్నికల తాజా సర్వే,ఏపీ సర్వే వార్తలు,లగడపాటి సర్వే,టీడీపికి సీట్ల సర్వే,జనసేన సీట్ల సర్వే,వైసీపీ సీట్లు సర్వే
  ఏపీ ఈసీ ద్వివేదీ


  మే 15 నుంచి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ఆ తరువాత వారికి విధులను అప్పగిస్తామని ద్వివేదీ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో సౌలభ్యాన్ని బట్టి 10 నుంచి 15 వరకూ కౌంటింగ్ టేబుళ్లుంటాయని చెప్పారు. వీవీ ప్యాట్ లలోని స్లిప్పుల లెక్కింపునకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై సర్వీస్ ఓట్లను లెక్కిస్తామని, ఆపై ఈవీఎంలలోని ఓట్లను, చివరిగా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్లలోని స్లిప్ లను లెక్కించి, సరిచూసి అధికారిక ఫలితం ప్రకటిస్తామని చెప్పారు.
  First published: