ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా? వినుకొండలో గందరగోళం... ఆగిన ఫలితాల ప్రకటన...

ఈవీఎంలు (ప్రతీకాత్మక చిత్రం)

ఈవీఎం ఓట్ల లెక్కింపులో టీడీపీకి ఒకే ఒక్క ఓటు... వీవీ ప్యాడ్ల లెక్కింపులో 194 ఓట్లు.. ఈవీఎంల టాంపరింగ్ జరిగిందంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ అభ్యర్థి... ఆగిన వినుకొండ ఫలితాల ప్రకటన...

  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. నారాచంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆంధ్రా ప్రజలు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్‌కు అధికార పట్టాలు అప్పగించారు. అయితే కొన్నిచోట్ల మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిదనే ఆరోపణలు వినిపిస్తోంది టీడీపీ. గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజికవర్గానికి చెందిన ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బోల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూత్‌కి చెందన ఈవీఎంలో ఓట్లకు, వీవీ ప్యాడ్ స్లిప్‌లకు మధ్య వ్యత్యాసం భారీగా ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్‌సీపీకి 173 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 492 ఓట్లు, అధికార టీడీపీకి మాత్రం ఒకే ఒక్క ఓటు వచ్చిందని ఈవీఎం లెక్కింపులో చూపించింది. అయితే లాటరీ పద్ధతిలో వీవీ ప్యాడ్ స్లిప్‌ల లెక్కింపు కోసం ఈవీఎంల ఎంపిక జరగగా... గండిగనుమల తండా బూత్ ఈవీఎం వచ్చింది. అందులో టీడీపీకి 194 ఓట్లు పడ్డట్టుగా వీవీ ప్యాడ్ స్లిప్పులు చూపించాయి. ఒక్క ఈవీఎంలోనే ఇంత భారీ తేడా చూపిస్తే...మొత్తంగా తాము వేల ఓట్లు కోల్పోయి ఉంటామని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన చేపడుతున్నాయి. మొత్తం వీవీ ప్యాడ్‌లు అన్నీ లెక్కించాలి... అంటూ డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు. దాంతో వినుకొండ నియోజికవర్గ ఫలితాన్ని ప్రకటించకుండా ఆపేశారు ఎన్నికల అధికారులు.

First published: