ANDHRA PRADESH ELECTION RESULT 2019 CHEATING TO BE FILLED ON LAGADAPATI RAJAGOPAL FOR BOGUS SURVEYS SAYS VIJAYA SAI REDDY CR
లగడపాటి ఇంకోసారి సర్వే అంటే ఛీటింగ్ కేసు... వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫైర్...
చంద్రబాబు, లగడపాటి, జగన్ (Image : Facebook)
ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలి... శాస్త్రీయంగా నిరూపించలేకపోతే ఆయనపై ఛీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి... ఇంకోసారి సర్వే అనకుండా గుణపాఠం చెప్పాలంటూ వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్స్...
ఏపీలో ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందని జాతీయ, తెలుగు రాష్ట్రాల సర్వేలన్నీ వెల్లడించాయి. అయితే ‘ఆంధ్రా ఆక్టోపస్’గా గుర్తింపు పొందిన లగడపాటి రాజగోపాల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారం చేపడుతుందని, వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్ష హోదాకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ఎంతో కష్టపడి సర్వే చేసి పక్కాగా చెబుతున్నానంటూ మీడియా సమావేశం ఏర్పాటుచేసి లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను ప్రకటించారు. ఇంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వే ఫలితాలకు భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ మరోసారి అధికారం చేపడుతుందని లగడపాటి సర్వే చెబితే, అందుకు భిన్నంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారం చేపట్టబోతోంది. దీంతో వైసీపీ నేత విజయసాయి రెడ్డి లగడపాటి సర్వే గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఎగ్జిట్ పోల్ సర్వే’ పేరుతో లగడపాటి చెబుతున్నవన్నీ అబద్ధాలన్ని కొట్టిపారేసిన వైసీపీ ఎంపీ... సర్వే శాంపిల్స్, ఇంటర్వ్యూ వివరాలు ప్రకటించబోతే ఛీటింగ్ కేసు పెట్టాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలి. ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు. ఎన్ని శాంపిల్స్ తీసారు. శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలి. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలి.ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలి.
వైసీపీ ప్రభంజనం ఖాయమనే సంకేతాలు వెలువడిన వెంటనే ట్విట్టర్లో వరుస ట్వీట్స్ చేశారు విజయసాయి రెడ్డి. ‘ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలి. ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు. ఎన్ని శాంపిల్స్ తీశారు. శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలి. లేకపోతే ఛీటింగ్ కేసు పెట్టి, లోపలేయాలి. ఇంకోసారి సర్వే అనకుండా లగడపాటికు గుణపాఠం నేర్పాలి’ అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు శకం ముగిసిందంటూ, నిజమైన ప్రజాస్వామ్యం చాలాఏళ్ల తర్వాత మళ్లీ ప్రభవించిందంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్లో తెలిపారు.
Published by:Ramu Chinthakindhi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.