ANDHRA PRADESH ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR REVIEWS WITH VISAKHAPATNAM OFFICIALS ON PANCHAYAT ELECTIONS PRN
AP Panchayat Elections: అలా చేస్తే ఊరుకునేది లేదు.. రాజ్యాంగం చెప్పిందే చేస్తున్నామన్న నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికలపై విశాఖ జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) విషయంలో రాజ్యాంగం చెప్పిందే తాము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (Andhra Pradesh State Election Commissioner) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( NImmagadda Ramesh Kumar) స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల విషయంలో రాజ్యాంగం చెప్పిందే తాము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై విశాఖపట్నం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విశాఖ జిల్లాలో 20,118 సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలింగ్ పై అధికారులకు పూర్తిగా అవగాహన కల్పించామన్నారు. విశాఖలో నిబద్ధత కలిగిన అధికారులున్నారన్న నిమ్మగడ్డ.. పోలింగ్ నమోదు శాతంపై కొద్దిపాటి అసంతృప్తి ఉందన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తమ మదిలో రాజ్యాంగం ఉందని.. ఎక్కువ మంది ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్నారు.
అభ్యర్థులు పోటీలో స్వేచ్ఛగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ అన్నారు. ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదన్న ఆయన.. పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏకగ్రీవాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను రేపు (ఫిబ్రవరి 2న) ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో మీడియా పాత్ర చాలా గొప్పదన్నారు. రాజ్యాంగం ఏం చెప్పిందో ఎన్నికల కమిషన్ అదే చేస్తోందని.., రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తున్నామన్నారు.
విశాఖలో అధికారులతో సమీక్ష అనంతరం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గొల్లలగుంటలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి మృతిపై విచారించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థితో స్వయంగా మాట్లాడతానని స్పష్టం చేశారు.
నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కడప పర్యటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచితనం గురించి చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.., చిత్తూరు జిల్లా వెళ్లి చంద్రబాబు అరచాకాల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ రూపొందిస్తున్న నిఘా యాప్ టీడీపీ ఆధ్వర్యంలో రూపొందుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.