సీఎం క్యాంపు కార్యాలయమే ఏపీ గవర్నర్ నివాసం..?

AP Raj Bhavan: సచివాలయం, అసెంబ్లీని నిర్మించిన ఏపీ ప్రభుత్వం రాజ్‌భవన్‌ను మాత్రం నిర్మించలేదు. అయితే, ఇప్పుడు ఏపీకి కూడా కొత్తగా గవర్నర్ నియామకం కావడంతో రాజ్‌భవన్ ఎలా అన్న సమస్య ఎదురైంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 16, 2019, 7:05 PM IST
సీఎం క్యాంపు కార్యాలయమే ఏపీ గవర్నర్ నివాసం..?
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్ నియమితులయ్యారు. అయితే, రాజధాని కేంద్రంగా ఆయన పాలన సాగించడానికి మాత్రం రాజ్‌భవన్ లేదు. రాష్ట్ర విభజన జరిగాక తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నివాసం ఉంటున్న ఆయన.. అవసరం వచ్చినప్పుడల్లా తాత్కాలిక బస ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లి వచ్చేవారు. దీంతో రాజ్‌భవన్ అవసరం అంతగా లేకపోయింది. సచివాలయం, అసెంబ్లీని నిర్మించిన ఏపీ ప్రభుత్వం రాజ్‌భవన్‌ను మాత్రం నిర్మించలేదు. అయితే, ఇప్పుడు ఏపీకి కూడా కొత్తగా గవర్నర్ నియామకం కావడంతో రాజ్‌భవన్ ఎలా అన్న సమస్య ఎదురైంది. అయితే, ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికోసం సీఆర్డీయే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పరిపాలనను ఏపీ నుండి సాగించాలనుకున్నప్పుడు అందుకు వీలుగా ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు అక్కడికి వెళ్లిపోయారు. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్ రెడ్డి తన ఇంటి నుంచే పాలన సాగిస్తున్నందున సీఎం క్యాంపు కార్యాలయం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని గవర్నర్ తాత్కాలిక నివాసంగా మార్చుతున్నారు. మరోవైపు, నవ్యాంధ్రలో గవర్నర్ శాశ్వత నివాసం, కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>