• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH DEPUTY CM NARAYANA SWAMY SENSATIONAL COMMENTS SU

Andhra Pradesh: నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. వివాదస్పద వ్యాఖ్యలు

Andhra Pradesh: నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. వివాదస్పద వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కల్లాగా అరిచే నాయకులు చాలా మంది ఉన్నారని.. కానీ తాను వారి పేర్లు చెప్పదలచుకోలేదని వ్యాఖ్యానించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కల్లాగా అరిచే నాయకులు చాలా మంది ఉన్నారని.. కానీ తాను వారి పేర్లు చెప్పదలచుకోలేదని వ్యాఖ్యానించారు. కానీ ప్రజలు మాత్రం కుక్కల్లాగా అరవలేదని నోరుజారారు. గుడ్ ఫ్రైడే అనేది అల్లా పండుగ అంటూ వ్యాఖ్యానించారు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ సందర్భంగా తాను మాట్లాడిన దానిపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తాను ఎలాంటి మత ప్రచారం చేయలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కులాలను పట్టించుకోకుండా పేదవారికి ఇళ్ల స్థలాలు పంచిపెడుతున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలందరూ సమానమేనని చెప్పారు.

    ఇక, వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్యమత ప్రస్తావన తీసుకురావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి పండుగ రోజున పేదలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ఇక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారు.

    అయితే తిరుమల కొండపై అన్యమత ప్రస్తావన తీసుకురావడంపై పలు హిందూ సంఘాలతో పాటు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయం వెలుపల మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు