Andhra Pradesh: అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్... ఆ పథకాలే కొంపముంచుతున్నాయా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అమలవుతున్న సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. ప్రతి నెలా ఒకటి రెండు చొప్పున పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకే నేరుగా నగదును జమ చేస్తున్నారు.

 • Share this:
  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. ప్రతి నెలా ఒకటి రెండు చొప్పున పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకే నేరుగా నగదును జమ చేస్తున్నారు. నవరత్నాలు పేరిట సంక్షేమ పధకాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి చేతికి ఎముక లేనట్లుగా ఖర్ఛు చేస్తుండటం రాష్ట్ర ఖజానాకి తలకి మించిన భారంగా పరిణమింంచింది. జగన్ అధికారం చేపట్టిన నాటికి ఖాళీ ఖజానా, లోటు బడ్జట్ తో స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దివాళాతీసే దిశగా పయనిస్తోంది. నెలాఖరు కావస్తున్నా ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ జులై నెల జీతం పూర్తిగా ఇవ్వలేని దుస్థితిలో ఉందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు ,గ్రామ/వార్డు సచివాలయ భవనాలు,అమూల్ పాల కేంద్రాలు, ఇవికాక రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో పూర్తిగా చేతులెత్తేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేదు. కొత్తగా ఏవైనా అభివృృద్ధి పనులు చేయాలంటే ఆ బిల్లులు అసలు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. దీంతో ప్రభుత్వ కాంట్రాక్టులు అంటేనే కాంట్రాక్టర్లు హడలిపోతున్నారు. ఏ రాష్ట్రమైనా ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఆ రాష్ట్రంలో ఎంతోకొంత ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలో ఏర్పటు చేస్తే తప్పించి అచ్చం అప్పుల మీద నెట్టుకు రావడం కష్టమనే చెప్పాలి.

  ఇది చదవండి:  ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారా..? పిలిచి క్లాస్ పీకడం ఖాయమా..?


  పరిమితికి మించి అప్పులు చేయడం, మరోవైపు కేంద్రం రుణపరిమితిపై ఆంక్షలు విధించడంతో నిధుల సమీకరణ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం తమ అప్పులను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే..!


  పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లెక్కలతో సహా ప్రశ్నలు సంధిస్తుంటే ప్రభుత్వం వైపు నుండి ఎదురుదాడే తప్ప సరైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పాలి. పైగా ఆర్ధిక మంత్రి స్వయంగా ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఎంతటి బేలతనం గా ఉందో ఆయన చెప్పకనే చెప్పారు. మద్యం, పెట్రోల్ ద్వారా అత్తెసురు ఆదాయం వస్తున్నా అది రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవక పోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారి రాష్ట్రానికి వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయం కూడా చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించటానికి కూడా సరిపోదని ఆర్ధిక వేత్తలు తేటతెల్లం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: