కొరడా ఝళిపించిన ఏపీ కొత్త సీఎస్...

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీ నీలం సహానీ కొరడా ఝళిపించారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.

news18-telugu
Updated: November 22, 2019, 5:14 PM IST
కొరడా ఝళిపించిన ఏపీ కొత్త సీఎస్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నీలం సహానీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీ నీలం సహానీ కొరడా ఝళిపించారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్‌ఓ అచ్చయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజిలెన్స్ విచారణలో వారు తప్పు చేసినందుకు వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఏపీడీసీ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరి తన విధినిర్వహణలో పలు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ తరఫున విచారణ జరిపిన సదరు ఇద్దరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికను సమర్పించినట్టు ప్రభుత్వం భావించింది. దీంతో ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిద్దరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇద్దరూ అమరావతి దాటి వెళ్లవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వం ఎంత దృఢ సంకల్పంతో ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
First published: November 22, 2019, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading